Vikram Cobra Collections: తమిళ్ హీరో విక్రమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన చిత్రం కోబ్రా..చాలా కాలం నుండి విడుదలకి నోచుకోని ఈ చిత్రం ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని ఈరోజు ఘనం గా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలైంది..తొలి రోజు తొలి ఆట నుండే పర్వాలేదు అనే రేంజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో దక్కించుకుంది..నైజాం సీడెడ్ మరియు ఆంద్ర ప్రాంతాలలో ఈ సినిమాకి మార్నింగ్ షోస్ నుండే మంచి ఆక్యుపెన్సీలు వచ్చాయి..దీనితో ఈ సినిమా కి ఇటీవల కాలం లో విక్రమ్ సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా పేరు తెచ్చుకుంది..తెలుగు లో అపరిచితుడు సినిమా నుండి విక్రమ్ కి మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉండడం తో ఈ సినిమాకి దాదాపుగా 4 కోట్ల 50 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది..అయితే మొదటి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసింది..బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఎంత వసూలు చెయ్యాలి అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
Vikram
వినాయక చవితి రోజు కలిసి రావడం తో కోబ్రా సినిమాకి తెలుగు మరియు తమిళ్ వెర్షన్స్ లో దుమ్ము దులిపే కలెక్షన్స్ వచ్చాయి..టాలీవుడ్ లో ఒక పక్క పవన్ కళ్యాణ్ జల్సా మరియు తమ్ముడు సినిమాల రీ రిలీజ్ మానియా ని తట్టుకొని కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకుంది అంటే మాములు విషయం కాదు..మొదటి రోజే ఈ సినిమా తెలుగు వర్షన్ లో రెండు కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను సాధించింది.
Vikram
అంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని మొదటి రోజే 50 శాతం రీచ్ అయిపోయింది అన్నమాట..టాక్ కూడా బాగా రావడం తో ఈ సినిమా టాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..చాలా కాలం తర్వాత విక్రమ్ కి ఒక మంచి బాక్స్ ఆఫీస్ హిట్ పడినట్టు తెలుస్తుంది..ఈ సినిమా వీక్ డేస్ లో కూడా డీసెంట్ వసూళ్లను రాబడుతూ ముందుకి దూసుకుపోతే కచ్చితంగా ఫుల్ రన్ రెండు నుండి మూడు కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ