Wake Oberoi Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బ్రేక్ చేయాలని చూస్తుంటారు. కొంతమంది హీరోలకు అది వర్కౌట్ అయితే మరికొందరికి సెట్ అవ్వడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకుంటున్న సబ్జెక్టులు ఫ్రెష్ గా లేకపోవడం…దీనివల్ల వాళ్ళు చేసే సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు. హీరోలను గొప్ప గా ప్రజెంట్ చేయాలంటే దర్శకులకు మంచి విజన్ ఉండాలి. అది ఉన్నప్పుడే హీరోలను డిఫరెంట్ గా చూపిస్తూ చాలామంది దర్శకులు కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తారు. అది ఏ మాత్రం అది తేడా కొట్టిన సక్సెస్ రావడం కష్టమవుతోంది…
Also Read: మాస్ జాతర’ ఫస్ట్ రివ్యూ…సెకండాఫ్ ఏంటి అలా ఉంది..?
ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో డిఫరెంట్ అటెంప్ట్ చేసి ఓవర్ నైట్లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆ సినిమా తర్వాత ఆయన ‘అనిమల్’ మూవీ చేశాడు… ఈ సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ అయినప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ ఆ సినిమా వర్క్ గురించి సందీప్ కి కాల్ చేసి పర్సనల్ గా చాలాసేపు మాట్లాడాడట. దాంతో వీళ్లిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ కుదిరింది.
ఇక ఆ తర్వాత ‘అనిమల్’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు…ఇక వివేక్ ఓబెరాయ్ ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక సందర్భంలో తెలియజేశాడు. స్పిరిట్ సినిమాలో తన క్యారెక్టర్ లో జీవించి మరోసారి తనను తాను గొప్ప నటుడిగా ఎలివేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ మూవీలో ఆయన పాత్ర ఏంటి అనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం స్పిరిట్ కి సంబంధించిన ఒక వాయిస్ ఓవర్ రిలీజ్ చేశారు. ఆ వాయిస్ ఓవర్ ను బట్టి చూస్తే ఈ సినిమా చాలా వైల్డ్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది. ఈ మూవీ తో వాళ్ళకి ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…