https://oktelugu.com/

బాలయ్య ప్లేస్ లో వరుణ్ తేజ్.. స్టార్ డైరెక్టర్ ఆశ !

సినిమా ఇండస్ట్రీ అంటేనే.. కమర్షియల్ మయం. మాస్ దర్శకుడిగా వరుస సక్సెస్ లు అందుకున్నప్పుడు వివి వినాయక్ చుట్టూ ఎప్పుడూ హీరోలు తిరుగుతుండేవారు. ఎప్పుడైతే వినాయక్ సక్సెస్ ట్రాక్ తప్పాడో.. ఇక అప్పటి నుండి వినాయక్ ను పట్టించుకోవడం మానేశారు స్టార్ హీరోలు. చివరకు చిన్నాచితకా హీరోలు కూడా పట్టించుకునే పరిస్థితిలో వినాయక్ లేకపోవడంతో, దర్శకుడిగా చేతిలో గత మూడు సంవత్సరాల నుండి ఒక్క సినిమా కూడా లేదు వినాయక్ కి. మొత్తానికి వినాయక్ ను ప్రస్తుతం […]

Written By:
  • admin
  • , Updated On : April 12, 2021 / 02:56 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీ అంటేనే.. కమర్షియల్ మయం. మాస్ దర్శకుడిగా వరుస సక్సెస్ లు అందుకున్నప్పుడు వివి వినాయక్ చుట్టూ ఎప్పుడూ హీరోలు తిరుగుతుండేవారు. ఎప్పుడైతే వినాయక్ సక్సెస్ ట్రాక్ తప్పాడో.. ఇక అప్పటి నుండి వినాయక్ ను పట్టించుకోవడం మానేశారు స్టార్ హీరోలు. చివరకు చిన్నాచితకా హీరోలు కూడా పట్టించుకునే పరిస్థితిలో వినాయక్ లేకపోవడంతో, దర్శకుడిగా చేతిలో గత మూడు సంవత్సరాల నుండి ఒక్క సినిమా కూడా లేదు వినాయక్ కి.

    మొత్తానికి వినాయక్ ను ప్రస్తుతం స్టార్స్ ఎవ్వరూ పట్టించుకోని స్థితిలో లేరని తేలిపోయింది. అయితే స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న వినాయక్ అంటే, అందరి హీరోలకు ప్రత్యేక అభిమానం ఉన్న మాట వాస్తవం. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ ఇలా అందరూ వినాయక్ అంటే ఇష్ట పడతారు. పైగా వీరందరికీ వినాయక్ ఒకప్పుడు హిట్ ఇచ్చాడు కూడా. అందుకే వినాయక్ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని ఈ హీరోలంతా కోరుకుంటున్నారు.

    ఈ మధ్య నడిచిన ఓ హీరో బర్త్ డే పార్టీలో హీరోలంతా కలిశారు. ఈ పార్టీకి వినాయక్ కూడా హాజరయ్యాడట. వినాయక్ ను చూసిన హీరోలంతా వెళ్లి హాగ్ చేసుకుని, ఎక్కడా లేని ప్రేమను కురిపించారట. మీరు సినిమా తీయాలని.. అవసరం అయితే.. మేము గెస్ట్ రోల్స్ అయినా చేస్తాం అంటూ ఇద్దరు ముగ్గరు హీరోలు అభయం కూడా ఇచ్చారట. కానీ, వినాయక్ కి ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరో డేట్స్ ఇచ్చేలా లేడు.

    వరుణ్ తేజ్ కోసం ఆ మధ్య వినాయక్ ఒక కథ రాశాడట. వరుణ్ తేజ్ కి గాని కథ నచ్చితే.. పిలిచి డేట్స్ ఇస్తాడు. అందుకే వినాయక్ కూడా వరుణ్ కోసం ప్రయత్నాలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లో నందమూరి బాలయ్యతో సినిమా చేయాలని వినాయక్ కి ఒక ఒప్పందం ఉంది. ఇప్పుడు బాలయ్య ప్లేస్ లోకి వరుణ్ తేజ్ వచ్చే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ కి కథ నచ్చుతుందా. మరి చూడాలి ఏమి జరుగుతుందో.