
‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’లో మంచి బిజినెస్ మెన్ ఉన్నాడు. అలాగే చరణ్ లో మంచి స్నేహశీలి కూడా ఉన్నాడు. పైగా చరణ్ స్నేహానికి ఎంతో విలువ ఇస్తాడు. అందుకే మిగతా హీరోలతో మంచి స్నేహం ఉంది. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, బన్నీ ఇలా అందరు హీరోలతో కలిసి అప్పుడప్పుడు టూర్ లు కూడా వేస్తుంటాడు చెర్రీ. కాగా ఇప్పుడు ఆ స్నేహాన్ని పెంచుకునే ఐడియా ఒకటి చరణ్ కి తట్టింది.
ప్రస్తుతం దాన్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో ఉన్నాడట. ఇంతకీ ఏమిటి ఆ ఐడియా అంటే.. సెలెబ్రేట్ క్లబ్. అంటే ఏమిటంటే.. అందరు హీరోలూ ఏడాదికి ఒక చోట కలుసుకుని ఎంజాయ్ చేయడం. ఇదేమి కొత్తది ఏమి కాదు. మెగాస్టార్ చిరంజీవి అండ్ ఆ బ్యాచ్ హీరోలు, హీరోయిన్స్ కలిసి ప్రతి ఏడాది ’80 స్టార్స్’ పేరుతో ఒక సెలెబ్రేట్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేసుకుని సౌత్ హీరోలంతా సెలెబ్రేట్ చేసుకుంటుంటారు.
అలాగే ప్రతి ఏడాది వాళ్లలాగే.. సౌత్, నార్త్ హీరోలందరిని కలిపి ఓ సెలెబ్రేట్ క్లబ్ ని ఏర్పాటు చేయాలనేది చరణ్ కి వచ్చిన ఐడియా అట. తనలాగే 2000 బ్యాచ్ హీరోలతో పాటు అంతకుముందు హీరోలను కలుపుతూ ఇలాంటి క్లబ్ ను ఒకదాన్ని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ క్లబ్ లో ఏ హీరోలు జాయిన్ అవుతారో చూడాలి. అన్నట్టు కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన తరువాత ఈ యంగ్ హీరోల సెలెబ్రేషన్స్ ఉంటాయట.