
‘ఇస్మార్ట్ శంకర్’ తో దక్కిన విజయం ‘రెడ్’ సినిమాతో ఎగిరిపోయింది. మళ్ళీ ఫామ్ లోకి రావాలని రామ్ కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ తమిళ క్రియేటివ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా చేస్తోన్నాడు. అయితే ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతుంది. కాగా ఈ సినిమా తరువాత ఎలాంటి సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో సినిమా చేయాలి ? అని రామ్ ఇప్పటికే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో అనిల్ రావిపూడితో సినిమా ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన ‘సరిలేరు నీకెవ్వరూ’ తరువాత అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ అంటూ మరో కామెడీ ఎంటర్ టైనర్ ను చేస్తున్నాడు. అనిల్ రావిపూడి చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది. కాబట్టి, అనిల్ డిసెంబర్ నాటికి ఫ్రీ అయిపోతాడు. అందుకే రామ్ అనిల్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కథ ఫైనల్ అయ్యాక డిసెంబర్ లో మన సినిమాని ఎనౌన్స్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా రిలీజ్ చేద్దాం అని రామ్ ప్రపోజల్ పెట్టాడట.
అనిల్ రావిపూడి మాత్రం ప్రస్తుతం చేస్తోన్న ఎఫ్ 3 సినిమా రిజల్ట్ ను బట్టి తర్వాత సినిమాని ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. పైగా అనిల్ కి తన తరువాత సినిమాకి ఆల్ రెడీ కమిట్ అయిపోయాడు. హీరో రవితేజతో ఒక సినిమా చేస్తానని అనిల్ మాట ఇచ్చాడు. అలాగే బాలయ్యతో ‘రామారావుగారు’ అనే టైటిల్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. బాలయ్య వైపు నుండి అనిల్ కి ఇప్పటికే ఫోన్స్ కూడా వెళ్లాయి.
కాబట్టి అనిల్ కి ఇంకో ఆప్షన్ ఉండకపోవచ్చు. ఒకవేళ బాలయ్యతో సినిమా చేయకపోతే.. రామ్ తో సినిమాకి అనిల్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అలాగే రవితేజ కూడా అనిల్ తో టచ్ లో ఉన్నాడు. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరికీ ఓకే చెబుతాడో చూడాలి.