Vrusshabha Movie Collection: ఈ ఏడాది మలయాళం బాక్స్ ఆఫీస్ వద్ద రెండు సార్లు 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన సినిమాలను అందించి సెన్సేషన్ సృష్టించిన నటుడు మోహన్ లాల్(Mohanlal). ఈ ఒక్క ఏడాది లోనే ఆయన నాలుగు బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్నాడు. ‘తుడారం’ చిత్రం అయితే ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మోహన్ లాల్ నుండి క్రిస్మస్ కానుకగా విడుదలైన ‘వృషభ’ అనే చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎలాంటి ఫ్లాప్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ స్టార్ హీరో కి కూడా ఇంతటి దారుణమైన ఓపెనింగ్స్ రాలేదు. బహుశా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. రీ రిలీజ్ సినిమాలతోనే దుమ్ము లేపే వసూళ్లను రాబట్టే మోహన్ లాల్ కి, ఇంత పెద్ద చారిత్రాత్మక సినిమాతో ఇలాంటి పరాభవం దారుణం అనే చెప్పాలి.
క్రిస్మస్ నేషనల్ హాలిడే ..ఎంత ఫ్లాప్ సినిమా అయినా ఈ తేదీన విడుదలైతే బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలాంటిది వృషభ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి కోటి రూపాయిల గ్రాస్ ఓపెనింగ్ కూడా రాలేదు. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి వివరిస్తే కన్నీళ్లు రాక తప్పదు. కేరళ ప్రాంతం నుండి 43 లక్షల ఓపెనింగ్ ని రాబట్టిన ఈ సినిమాకు, తెలుగు రాష్ట్రాల నుండి 17 లక్షలు, నార్త్ ఇండియా నుండి 9.2 లక్షలు వచ్చాయి. ఇక కర్ణాటక ప్రాంతం నుండి అయితే కేవలం 240 రూపాయిలు మాత్రమే వచ్చాయి. అంటే కేవలం ఒక్కరే ఈ సినిమాని కర్ణాటక రాష్ట్రము మొత్తం మీద మొదటి రోజు చూసారు అన్నమాట. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి 19 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 88 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇండియా లో ఏ సూపర్ స్టార్ కి కూడా ఇంత నీచమైన ఓపెనింగ్ రాలేదు. ఇలాంటి ఓపెనింగ్ రావడానికి ప్రధాన కారణం , మూడేళ్ళ క్రితం మొదలైన సినిమా. అనేక సార్లు వాయిదా పడడంతో ఆడియన్స్ లో పూర్తిగా ఆసక్తి పోయింది. అంటే మన తెలుగు లో హరి హర వీరమల్లు ఎలా అయితే ఆలస్యం అయ్యిందో, అలా అన్నమాట ఈ చిత్రం కూడా. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లతో పోలిస్తే హరి హర వీరమల్లు ని ఇండస్ట్రీ హిట్ అనొచ్చు. 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఆ చిత్రం. 130 కోట్ల గ్రాస్ రాబట్టిన హరి హర వీరమల్లు ఎక్కడా?, రెండు రోజులకు కలిపి కోటి రూపాయిల గ్రాస్ ని రాబట్టిన వృషభ ఎక్కడ. దీనిని బట్టే మన టాలీవుడ్ హీరోల స్టార్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.