Hero Raviteja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన రవితేజ అంటే ఎవరికైనా గౌరవం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి?..కష్టపడే తత్త్వం, టాలెంట్, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు అనడానికి ఒక ఉదాహరణ రవితేజ. ఏ రంగం లో అయినా ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఉంటే సక్సెస్ అవ్వొచ్చు. అలాంటి రవితేజ ఈమధ్య కాలం లో ఆయన చేస్తున్న సినిమాలను చూసి అభిమానులు కంటతడి పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఎలాంటి సినిమాలు చేసేవాడు, ఇప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు, చిన్నప్పటి నుండి మనం చూస్తూ పెరిగిన రవితేజ ఇతనేనా?, అసలు ఏమైంది మా హీరో కి అంటూ అభిమానులు ఏడవని రోజంటూ లేదు. మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఆయనకు మాస్ మహారాజా అని పేరు పెట్టుకున్నారు అభిమానులు.
ప్రతీ సినిమాలో వెండితెర పై మాస్ మహారాజ రవితేజ అని పేరు పడితే, అభిమానులు పొందే ఆనందమే వేరు. అయితే ఇక నుండి ఆ మాస్ మహారాజ అనే టైటిల్ వెండితెర మీద కనిపించదు. కేవలం రవితేజ అనే పేరు మాత్రమే ఇక మీదట కనిపిస్తుందట. ఆయనని పిలవడం కూడా రవితేజ అని మాత్రమే పిలవాలట. మాస్ మహారాజ లాంటివి జోడించి పిలవొద్దని చెప్పాడట. ధమాకా తర్వాత వరుసగా ఆరు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు రావడం రవితేజ మనసుని బాగా బాధ పెట్టాయి. ఆడియన్స్ డిఫరెంట్ గా తీసిన ఈగల్, రావణాసుర వంటి చిత్రాలను ఫ్లాప్ చేశారు. పోనీ వాళ్లకు ఇష్టమైన మాస్ మసాలా సినిమాలు చేసినా ఫ్లాప్ చేశారు. ఇది ఆయన మనసుని బాగా బాధపెట్టింది. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కేవలం రవితేజ అనే టైటిల్ మాత్రమే మనం చూస్తామట, మాస్ మహారాజ అనే టైటిల్ కనిపించదట. అంతే కాదు ఈ సినిమాకు రవితేజ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా అందుకోలేదట. సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యి, కలెక్షన్స్ వచ్చిన తర్వాతే రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇలాంటి పరిస్థితి రవితేజ కి ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ కూడా రాలేదు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి, మళ్లీ ఆయనకు పూర్వ వైభవం దక్కాలని కోరుకుందాం.