ఇరవై ఏళ్ల క్రితం రేప్ సీన్ లేని తెలుగు సినిమా లేదు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఆ రేంజ్ లో అప్పటి రచయితలూ తమకు కథల్లో ఆడవాళ్లను బలవంతపు దాడి చేసే సన్నివేశాలను అంత ఇష్టంగా రాసేవారు. వారు రాస్తే రాశారు.. మరి ఆ సీన్స్ లో నటించేవాళ్ళు ఎవరు ఉన్నారనగానే.. వెంటనే గుర్తుకువచ్చే నేమ్స్ లో ముందువరసలో నిలిచే నేమ్.. చలపతిరావు. గతంలో చాలా సినిమాలు అత్యాచారాల చుట్టూనే తిరిగేవి. తమ భార్యనో, చెల్లినో రేప్ చేస్తే వారి పై హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే మెయిన్ కథగా ఉండటంతో మొత్తానికి చలపతిరావు లాంటి వారికీ అది బాగా ప్లస్ అయింది.
Also Read: రోజా కొత్త బిజినెస్.. యూత్ కోసమే !
దీనికితోడు ఒకప్పుడు రేప్ సీన్లు లేనిదో సినిమా ఆడని పరిస్థితి ఉండేది. సినిమాల్లో చేసే రేపులన్నీ ఉత్తుత్తివే కావొచ్చు. అయినా సరే ఒకరిపై ఒకరు కిందా మీదా పడ్డప్పుడు, ఆ సమయంలో హీరోయిన్లు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ అప్పటి మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ని ఇచ్చేవి. ఇక తమ సినిమాల్లో రేప్ సీన్ ఉందంటే వెంటనే దర్శక నిర్మాతలకు చలపతిరావునే గుర్తుకువచ్చేవారు. అందుకే, ఆయన ఏకంగా 94 రేప్ సీన్లలో పాల్గొని హిస్టరీ క్రియేట్ చేయగలిగాడు. తన 50 ఏళ్ల సినీ కెరీర్లో సుమారు 1200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన చలపతిరావుకి ఎక్కువుగా నేమ్ తీసుకువచ్చిన సీన్స్ మాత్రం కేవలం రేప్ సీన్లు మాత్రమే.
Also Read: అవి రావనుకునే పెళ్లికి సిద్ధపడ్డాను – సమంత
కాగా చలపతిరావుది కృష్ణా జిల్లా పెడన మండలం బల్లిపర్రు గ్రామం. సినిమాలపై ఆసక్తితో 22వ ఏట ఆయన అవకాశాల కోసం వెతుక్కుంటూ మద్రాస్ కి వెళ్లి.. అక్కడ ఎన్నో కష్టాలు పడి.. ఎట్టకేలకూ ఎన్టీఆర్ గారికి దగ్గరయ్యారు. దాంతో తొలి నుంచీ ఆయనకు రామారావుగారి సాయం అందుతూ ఉండేది. అందుకే అప్పట్లో రేప్ సీన్ ఉంటే చలపతిరావునే పిలిచేవారు. సత్యనారాయణ, రావుగోపాలరావు విలన్ గా నటించిన సినిమాల్లో కూడా రేప్ సీన్ అంటే.. ‘మన చలపాయ్ ఉన్నాడుగా.. రేప్ సీన్స్ ఆయనే బాగా చేయగలడు’ అని వాళ్ళు నవ్వుతూ చెప్పేవారట. అయితే వయసు పెరిగేకొద్దీ చలపతిరావు విలన్ పాత్రలకు స్వస్తి పలికి, క్రమశిక్షణ కలిగిన తండ్రిగా, సోదరుడిగా సున్నిత పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్