Viswambhara VS Mirai : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) మూవీ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. మొదట్లో ఈ సినిమాపై పాన్ ఇండియన్ చిత్రానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో అలాంటి క్రేజ్ ఉండేది. కానీ టీజర్ విడుదల తర్వాత అనేక ట్రోల్స్ ని ఎదురుకొని ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది విశ్వంభర. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఈ చిత్రం పై ఏర్పడిన ఈ నెగటివ్ ఫీలింగ్ నుండి బయటకు తీసుకొని రావడం అంత తేలికైన విషయం కాదు. మైండ్ బ్లాక్ అయ్యే కంటెంట్ వస్తే తప్ప అది సాధ్యం అవ్వదు. అందుకే మేకర్స్ గ్రాఫిక్స్ మొత్తాన్ని రీ వర్క్ చేయించి, ఇప్పుడు హై క్వాలిటీ ప్రోడక్ట్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే సరికొత్త టీజర్ ని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.
Also Read : శాస్త్రవేత్తగా మారిపోయిన మీనాక్షి చౌదరీ..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ వర్క్ మొత్తం పూర్తి అయిపోయినట్టే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగష్టు రెండవ వారం లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. నిర్మాతల ఆలోచన అయితే ఆగష్టు 1 న విడుదల చేయాలని, కానీ అదే రోజున తేజ సజ్జ(Teja Sajja) పాన్ ఇండియన్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) విడుదల కాబోతుంది. ఈ సినిమా మేకర్స్ విడుదల తేదీని గత ఏడాదే అధికారికంగా ప్రకటించేశారు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమానే కాబట్టి వాళ్ళు ఇప్పుడు ‘విశ్వంభర’ కోసం వెనక్కి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. తేజ సజ్జ చిన్నతనం లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. చిరంజీవి తో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.
తేజ సజ్జ చేతుల్లో ఉన్న విషయమే అయితే, చిరంజీవి అడిగిన వెంటనే ఒప్పుకుంటాడు. కానీ ఇది ఆయన చేతుల్లో లేదు, నిర్మాత చేతుల్లోనే ఉంది. అయితే మెగాస్టార్ రిక్వెస్ట్ చేస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఆయన మాటకు విలువని ఇచ్చి వెనక్కి తప్పుకుంటారు. కాబట్టి ‘విశ్వంభర’ ఒకవేళ ఆగష్టు 1 న విడుదల అయితే మిరాయ్ చిత్రం విడుదల అవ్వదు అని విశ్లేషకులు చెప్తున్నారు. అదే నెలలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన ‘వార్ 2’ ఉంది, అదే విధంగా రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం కూడా విడుదల కానుంది. కాబట్టి ఆగష్టు రెండవ వారం లో రావడం కంటే, ఆగష్టు 1 న విశ్వంభర ని విడుదల చేయడం బెటర్ అని ఆ చిత్ర పంపిణీదారులు నిర్మాతలను కోరుతున్నారట. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.