Meenakshi Chaudary : రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ లో అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary). ఈమె మన టాలీవుడ్ లోకి సుశాంత్ హీరో గా నటించిన ‘ఇచ్చట వాహనములు ఆపరాదు’ అనే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు కానీ, ఈమెకు అవకాశాలు మాత్రం భారీగానే వచ్చాయి. ఈ చిత్రం తర్వాత ఆమె రవితేజ తో కలిసి ‘ఖిలాడీ’ చిత్రం లో నటించింది. ఆ తర్వాత అనేక సినిమాలు చేసింది కానీ ఎక్కువ శాతం ఫ్లాప్స్ అయ్యాయి. కానీ గత ఏడాది ఆమె నుండి విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రం, అదే విధంగా ఈ ఏడాది ఆమె నుండి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
Also Read : రెట్రో’ మూవీ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్..మామూలు దెబ్బ పడలేదుగా!
ఫ్లాప్స్ లో ఉన్నప్పుడే ఈమెకు అవకాశాలు క్యూలు కట్టేవి. ఇప్పుడు వరుసగా రెండు భారీ హిట్స్ వచ్చాయి, ఇక అవకాశాలు రాకుండా ఎలా ఉంటుంది. అయితే అకస్మాత్తుగా ఈమె శాస్త్రవేత్త అయ్యింది అంటున్నారేంటి?, సినిమాలు మానేసిందా?, సినిమాల్లోకి రాకముందు ఈమె వృత్తి డెంటిస్ట్ కదా, సడన్ గా శాస్త్రవేత్త ఎప్పుడు అయ్యింది వంటి ప్రశ్నలు మీ బుర్రలోకి వచ్చి ఉండొచ్చు. కానీ శాస్త్రవేత్త అయ్యింది నిజ జీవితం లో కాదు, సినీ జీవితం లో. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) హీరోగా, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం లో ఒక మిస్టిక్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ చిత్రం లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరీ నటిస్తుంది. ఇందులో ఆమె పురాతత్వ శాస్త్రవేత్తగా కనిపించబోతుంది. అంటే ఆర్కియాలజిస్ట్ అన్నమాట. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
కార్తీక్ దర్శకత్వం లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘విరూపాక్ష’ లో హీరోయిన్ సంయుక్త మీనన్ క్యారక్టర్ తో ఆడియన్స్ ని ఎలా షాక్ కి గురి చేశాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఈ సినిమాలో కూడా మీనాక్షి చౌదరీ క్యారక్టర్ లో అలాంటి ట్విస్టులు ఉంటాయా అనేది ఇప్పుడు సస్పెన్స్ మారిన అంశం. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే నాగ చైతన్య ఫిబ్రవరి నెలలో ‘తండేల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయమని అక్కినేని అభిమానులు అంటున్నారు.