https://oktelugu.com/

Nagarjuna: కొండ సురేఖ మీద వెయిట్ పడబోతుందా..? నాగార్జున కాంగ్రెస్ పెద్దలను కలిశాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఇద్దరిని రెండు కండ్లు గా అభివర్ణిస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన సేవల వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ రేంజ్ లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఒకప్పుడు తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని వీళ్లిద్దరు మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ వచ్చారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 01:46 PM IST

    Nagarjuna(10)

    Follow us on

    Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి ప్రస్తుతం ఉన్న అఖిల్ దాకా వాళ్లు తమ ఫ్యామిలీని ఇండస్ట్రీలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే చేసుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించిన, మెప్పించకపోయిన వాళ్ళ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక మొత్తానికైతే నాగార్జున మాత్రం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండటం విశేషము. ప్రస్తుతం ఆయన విలన్ పాత్రలను కూడా పోషిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ మీద కాంగ్రెస్ పార్టీ లో మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే ఆమె చేసిన మాటలకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది సినీ సెలబ్రిటీలు సైతం నాగార్జునకు అండగా నిలుస్తూ కొన్ని పోస్టులను కూడా చేశారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కొండా సురేఖ నాగార్జునకు సారీ చెప్పినప్పటికీ ఆమె మీద నాగార్జున చాలా కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఆమె మీద కేసు ఫైల్ చేశాడు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసి మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.

    మొత్తానికైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాల మీద ఆమెకు భారీ వేటు పడబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున మాత్రం ఈ విషయాన్ని చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ముందుకు సాగుతున్నాడు. ఇకమీదట ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే కూడా చాలామంది రాజకీయ నాయకులు భయపడి పోయేలా తను కొండ సురేఖ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    చూడాలి మరి నాగార్జున ఈ విషయాన్ని ఎక్కడ వరకు తీసుకెళ్తాడు అనేది… ఒకవేళ కొండా సురేఖ మీద వెయిట్ పడితే మాత్రం ఆమె మంత్రి పదవి పోయే అవకాశాలు కూడా ఉన్నాయంటూ మరి కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ మీద రాజకీయ నాయకులకు మొదటి నుంచి కూడా చాలా చులకన భావం అయితే ఉంటుంది. దానివల్లే ఏది పడితే అది మాట్లాడుతూ సినిమా వాళ్ళను కృంగదీయాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.