https://oktelugu.com/

Viswam Collection: గోపీచంద్ ‘విశ్వం’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 2వ వారం భారీగా పెరిగిన థియేటర్స్ సంఖ్య!

అక్టోబర్ 11 వ తారీఖున గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన 'విశ్వం' చిత్రం కూడా మంచి వసూళ్లతో సూపర్ హిట్ దిశగా ముందుకు పోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 10 రోజులు పూర్తి అయ్యింది. ఈ 10 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

Written By:
  • Vicky
  • , Updated On : October 21, 2024 / 03:40 PM IST

    Viswam Collection

    Follow us on

    Viswam Collection: సినీ ఇండస్ట్రీ కి భారీ వసూళ్లను తెచ్చిపెట్టే సీజన్స్ నిన్న మొన్నటి వరకు సంక్రాంతి, సమ్మర్ అని చెప్పేవాళ్ళు ట్రేడ్ పండితులు. గడిచిన రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు ఆ జాబితాలోకి ‘దసరా’ సీజన్ కూడా తోడైంది. గత రెండేళ్ల నుండి సినీ ఇండస్ట్రీ కి దసరా సీజన్ ఒక వరం లాగా మారిపోయింది. యావరేజ్ గా ఉన్న సినిమాలు సూపర్ హిట్ అయిపోతున్నాయి, ఫ్లాప్ అవ్వాల్సిన సినిమాలు యావరేజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ దసరా కానుకగా విడుదలైన చిత్రాలకు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిసింది. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి దసరా సీజన్ బాగా కలిసొచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా డీసెంట్ గ్రాస్ ని వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

    అయితే అక్టోబర్ 11 వ తారీఖున గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విశ్వం’ చిత్రం కూడా మంచి వసూళ్లతో సూపర్ హిట్ దిశగా ముందుకు పోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 10 రోజులు పూర్తి అయ్యింది. ఈ 10 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆంధ్ర ప్రదేశ్ లో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 6 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా 10 రోజులకు గాను ఈ చిత్రం 7 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి వస్తున్నా స్టడీ రన్ ని చూస్తుంటే బాక్స్ ఆఫీస్ పరంగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

    విడుదలకు ముందు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 10 కోట్ల రూపాయలకు జరిగిందట. మొదటి రోజు ఈ సినిమాకి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా వచ్చాయి. కానీ 10వ రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి ఏకంగా 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అంటే మొదటి రోజు వసూళ్ళలో 90 శాతం 10 వ రోజు వచ్చాయి అన్నమాట. రెండవ వారం అనేక ప్రాంతాల్లో ఈ సినిమాకి థియేటర్స్ సంఖ్య పెంచారట. ఒక్క నైజాం ప్రాంతంలోనే రెండవ వారం లో 30 కి పైగా థియేటర్స్ పెంచారంటే ఈ సినిమాకి జనాల్లో ఎంత ఆదరణ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వరుస ఫ్లాప్స్ లో ఉన్న గోపీచంద్, శ్రీను వైట్ల కి ఈ సినిమా సక్సెస్ మంచి బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి.