Vishwambhara : సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహరమైతే కాదు. అహర్నిశలు కష్టపడుతూ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్లిన వాళ్ళు మాత్రమే ఇక్కడ మెగాస్టార్లుగా వెలుగొందుతారు. అలా కాకుండా ఏదో టైమ్ పాస్ కోసం ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు ఎంత తొందరగా అయితే వస్తారో అంతే తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను సాధించడమే కాకుండా ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరోకెత్తుగా మారబోతున్నాయి. ఇక ఇప్పటికే ఆయన వశిష్ట(Vashishta) డైరెక్షన్ లో చేసిన విశ్వంభర (Vishvambhara) భారీ విజయాన్ని సాధిస్తుందంటూ ఫాన్స్ అందరు పండగ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు విశ్వంభర సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ సినిమా ఏ మేరకు రాణిస్తుంది. తద్వారా ఆయన ఈ సినిమాతో ఎలాంటి క్రేజ్ ని మూట గట్టుకోబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.
Also Read : ‘విశ్వంభర’ మరింత ఆలస్యం..ఈ ఏడాది విడుదల కష్టమేనా?..ప్రొడక్షన్ టీంపై మెగాస్టార్ మండిపాటు!
అయితే ఈ సినిమాని మొదట మే తొమ్మిదోవ తేదీన రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అనుకున్న డేట్ కి తీసుకు వచ్చే విధంగా కనిపించడం లేదట. కారణం ఏంటి అంటే ఈ సినిమాలో సిజీ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సిజీ కి సమయం సరిపోవడం లేదని మరో రెండు నెలల్లో రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది.
కాబట్టి ఈ సమయంలో ఈ సినిమాని ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు పూర్తి చేసి తీసుకురావడం చాలా కష్టమని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలంటే మాత్రం ఔట్ పుట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట. దానికోసమే ఈ సినిమాను మరింత లేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మాత్రం బాగా వచ్చిందని సిజీ వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చేసరికి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంటూ సినిమా మేకర్స్ చెబుతూ ఉండటం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో వశిష్ట స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి చిరంజీవి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయన ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ‘విశ్వంభర’ కి ఓటీటీ కష్టాలు..చేతులెత్తేసిన నిర్మాత..చిరంజీవి కెరీర్ లో మరో ‘అంజి’ కాబోతుందా?