Vishwak Sen Remuneration: విశ్వక్ సేన్(Vishwak Sen) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ'(Funky Movie) రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ కలెక్షన్స్ తో ముందుకు పోతోంది. ‘లైలా’ చిత్రం తర్వాత ఈ సినిమాతో విశ్వక్ సేన్ భారీ కం బ్యాక్ ఇస్తాడేమో అని అందరూ భావిస్తే, కెరీర్ లోనే మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చిత్రానికి జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ KV బ్రాండ్ ఇమేజ్ ఓవర్సీస్ లో తప్ప, తెలుగు రాష్ట్రాల్లో అసలు పనికి రాలేదు. పఃలితంగా ఓపెనింగ్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా వచ్చాయి. ఉదాహరణకు విశ్వక్ సేన్ గత చిత్రం ‘లైలా’ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తెచ్చుకొని 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మొదటి రోజున తెలుగు రాష్ట్రాల నుండి రాబడితే, ‘ఫంకీ’ చిత్రం 1.1 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
అంటే రెండు సినిమాల మధ్య తేడా కేవలం 20 లక్షల రూపాయిలు మాత్రమే. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రానికి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఒక్క నార్త్ అమెరికా లోనే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ ద్వారా $150K డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ టాక్ డివైడ్ గా రావడం తో మొదటి రోజు చాలా తక్కువ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక రెండవ రోజు అయితే పూర్తిగా పడిపోయింది ఈ చిత్రం. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రెండు కోట్ల రుపాయిలకు పైగా షేర్ వసూళ్లు వస్తే , రెండవ రోజు వరల్డ్ వైడ్ గా కేవలం కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ఈ చిత్రం లో నటించడం కోసం విశ్వక్ సేన్ నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులకు కలిపి బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. రోజురోజుకు తగ్గిపోతున్న కలెక్షన్స్ ని చూస్తుంటే, ఈ చిత్రం కనీసం విశ్వక్ సేన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ని అయినా తిరిగి రాబడుతుందా అనే అనుమానాలను కలిగిస్తోంది. రేపు శివ రాత్రి కాబట్టి, కొంత మేరకు ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టొచ్చు. ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.