Ori Devuda Collections: దీపావళి కానుకగా నిన్న విడుదలైన నాలుగు సినిమాలలో మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న చిత్రం ‘ఓరి దేవుడా’..విశ్వక్ సేన్ హీరో గా విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది..కామెడీ మరియు ఎమోషన్స్ పరంగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సినిమా..ముఖ్యంగా విశ్వక్ సేన్ నటన,లియోన్ జేమ్స్ అందించిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విక్టరీ వెంకటేష్ గారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణులుగా నిలిచాయి.

తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా ‘ఓ మై కడువులే’ కి రీమేక్ గా తెరకెక్కినప్పటికీ కూడా తెలుగు నేటివిటీ కి తగట్టుగా సరికొత్త గా చూపించడం లో డైరెక్టర్ అస్వాంత్ మరిముత్తు ఈ సినిమాని తీర్చిదిద్దాడు..తమిళ వెర్షన్ కి కూడా ఈయనే డైరెక్టర్ గా చేసాడు..ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా అన్ని ప్రాంతాలలో అదిరిపోయాయి.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయలకు జరగగా కేవలం మొదటి రోజే ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 90 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా..ఇక ఓవర్సీస్ మరియు కర్ణాటక వంటి ప్రాంతాలు కలుపుకొని మొదటి రోజు ఈ చిత్రం కోటి రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..నైజాం ప్రాంతం లో 35 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం, సీడెడ్ లో 10 లక్షల రూపాయిలు ,ఆంధ్ర లో 45 లక్షల రూపాయిల వసూలు వచ్చాయి.

కాంపిటీషన్ రిలీజ్ లో ఈ మాత్రం వసూళ్లు వచ్చాయంటే డీసెంట్ వసూళ్లు అనే చెప్పొచ్చు..ఇక పబ్లిక్ లో టాక్ కూడా బాగా ఉండడం తో కేవలం వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ స్టేటస్ ని దక్కించుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.