Prudhvi Marriage: నటుల ప్రైవేట్ జీవితాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. సర్దుకుపోయి బ్రతకడం అనే కాన్సెప్ట్ ఉండదు. ఇబ్బంది అనిపిస్తే విడిపోవడం, మరో పెళ్లి చేసుకోవడం చేస్తారు. సీనియర్ నటుడు పృథ్వి సైతం భార్యను వదిలేసి రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటకకు చెందిన పృథ్వి రాజ్ తెలుగులో బాగా ఫేమస్. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన పృథ్వి తెలుగు, తమిళ భాషల్లో రాణించారు. అమ్మ మనసు మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పృథ్వి… పెద్దయ్యాక ‘పెళ్లి’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఆ సినిమాలో పృథ్వి విలక్షణ నటన ఆకట్టుకుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడు.

అనంతరం పెళ్లి పందిరి సినిమాలో సెకండ్ హీరోగా జగపతిబాబుతో పాటు నటించారు. ఈ రెండు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఆయనకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి . హీరోగా మాత్రం సక్సెస్ కాలేదు. సమరసింహారెడ్డి, దేవుళ్ళు, నువ్వు నాకు నచ్చావ్, చెన్నకేశవరెడ్డి తో పాటు పలు హిట్ చిత్రాల్లో పృథ్వి నటించారు. సిల్వర్ స్క్రీన్ పై ఫేమ్ తగ్గాక పృథ్వి తమిళ్ సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

కాగా పృథ్వి రాజ్ 1994లో బీనా అనే ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు. కొడుకు ఆరోగ్యం సరిగా ఉండదని సమాచారం. అయితే భార్యా బీనాతో పృథ్వి రాజ్ విడిపోయారన్న వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీరిద్దరికీ మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారట. అలాగే పృథ్వి రెండో వివాహం చేసుకున్నారని సమాచారం అందుతుంది.
తనకంటే వయసులో చాలా చిన్నదైన మలేషియా అమ్మాయిని పృథ్వి వివాహం చేసుకున్నారట. పృథ్వి ప్రస్తుత వయసు 56 ఏళ్ళు కాగా… తనకంటే వయసులో ఆ అమ్మాయి 33 ఏళ్ళు చిన్నదట. వీరిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలపై నటుడు పృథ్వి రాజ్ స్పందించలేదు. ఆయన నోరు విప్పితే కానీ దీనిపై క్లారిటీ రాదు. 2019లో పృథ్వి రాజు వరుసగా తెలుగు చిత్రాలు చేశారు. ఎన్టీఆర్ మహానాయకుడు, కథనం, మార్షల్ చిత్రాల్లో పృథ్వి రాజ్ కీలక రోల్స్ చేశారు.