Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. మొదట్లో కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాలు ఈ చిత్రం పై ఉండేవి. కానీ ఎప్పుడైతే టీజర్ విడుదల అయ్యిందో, అప్పటి నుండి పరిస్థితులు మొత్తం తలక్రిందులు అయ్యాయి. సోషల్ మీడియా లో అభిమానుల నుండి వచ్చిన రెస్పాన్స్ ని పరిగణలోకి తీసుకొని, VFX టీం మొత్తాన్ని ప్రక్షాళన చేసి, సరికొత్త టీం తో VFX పనులు చేయించారు. దాదాపుగా మొత్తం పూర్తి అయ్యింది. కొత్తగా తయారు చేయించిన VFX షాట్స్ తో కూడిన ఒక టీజర్ కట్ ని సిద్ధం చేసి పెట్టారట. ఇది అతి త్వరలోనే మేకర్స్ అధికారికంగా విడుదల చేయబోతున్నారు. అంతకంటే ముందు మూవీ టీం ఒక భారీ ప్లాన్ కి శ్రీకారం చుట్టింది.
Also Read : ‘విశ్వంభర’ మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వికాస్ రెడ్డి రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళాడు. అక్కడ ఆయన విశ్వంభర మూవీ సరికొత్త టీజర్ ని ప్రదర్శించబోతున్నాడట. ఈ టీజర్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందని, కచ్చితంగా ఈ ఒక్క టీజర్ తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఈ చిత్రం పై ఏర్పడిన నెగటివ్ అభిప్రాయం తుడిచిపెట్టుకొని పోతుందని అంటున్నారు నెటిజెన్స్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. ఈ టీజర్ ని వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సోషల్ మీడియా లో ఆ చిత్ర నిర్మాత ఈరోజు మీకు కూడా దానిని రివీల్ చేస్తాము అంటూ ఒక మాట అన్నాడు. అది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించిన వీడియోనా?, లేకపోతే ‘విశ్వంభర’ సరికొత్త టీజర్ ని విడుదల చేస్తామని అన్నాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ పై కూడా మరో వారం రోజుల్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దసరా కానుకగా విడుదల చేద్దామని ముందుగా అనుకున్నారు. కానీ ఆ సమయానికి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రం విడుదల కాబోతుంది. మరో వారం లో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు కూడా. అంతర్గతంగా విశ్వంభర టీం ఓజీ టీం తో చర్చలు కూడా జరిపింది. ఆ చర్చలు ముగిసిన తర్వాత ఈ చిత్రాన్ని ఆగష్టు 1న గ్రాండ్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. అయితే ఇప్పటికే ఆ డేట్ లో తేజ సజ్జ మిరాయ్ చిత్రం రానుంది. ఇప్పుడు ఈ మూవీ టీం తో చర్చలు జరిపి , ఆ చిత్రాన్ని వాయిదా వేయించే ప్లాన్ లో విశ్వంభర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి మిరాయ్ టీం ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.
Also Read : ‘విశ్వంభర’ చిత్రం నుండి మొదటి పాట ‘రామ రామ’ ప్రోమో వచ్చేసింది..!