Suresh Babu : ప్రముఖ నిర్మాత సురేష్ బాబు(Suresh Babu Daggubati) నిన్న జరిగిన నిర్మాతల మండలి సమావేశం లో కాస్త అసహనం కి గురైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే థియేటర్స్ ఓనర్లు మాకు కచ్చితంగా వచ్చే కలెక్షన్స్ లో వాటాలు ఇవ్వాలి, లేకపోతే జూన్ 1 వ తేదీ నుండి థియేటర్స్ ని బంద్ చేస్తాము అంటూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కానీ నిన్న జరిగిన చర్చల తర్వాత బయ్యర్స్ ఆ బంద్ ని ఎత్తివేశారు. మరో 22 రోజుల్లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల అవుతుంది, అసలే వ్యాపారం లేదు, ఈ సమయంలో అంత పెద్ద సినిమాని వదులుకుంటే మొదటికే మోసం వస్తుంది, ఇవి ఎప్పటి నుండో ఉన్న సమస్యలే, భవిష్యత్తులో తేల్చుకుందాం అని తాత్కాలికంగా ఈ బంద్ ని విరమించారు.
ఈ సమావేశం లో నిర్మాత దిల్ రాజు మరియు ఇతర ఇండస్ట్రీ పెద్దలతో పాటు సురేష్ బాబు కూడా పాల్గొన్నాడు. అయితే థియేటర్స్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ తో సురేష్ బాబు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డిమాండ్స్ కొన్ని నచ్చలేదు. వాటికి ఇతర నిర్మాతలు అలోచించి చెప్తాము అనే మాట మాట్లాడడం తో కాసేపు అక్కడ సురేష్ బాబు కి, ఇతరులకు వాడావేడి చర్చలు నడిచాయట. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయట. దీంతో ఆవేశంతో ఊగిపోయిన సురేష్ బాబు, అక్కడి నుండి లేచి, కోపం తో తలుపుని కాళ్లతో కొట్టి బయటకు వెళ్ళిపోయాడట. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో సురేష్ బాబు ని ఇంత ఆవేశం తో చూడడం ఇదే తొలిసారి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎంతో శాంతంగా ఉండే సురేష్ బాబు ఇంత ఆవేశానికి గురి అవ్వడానికి గల కారణాలేంటో పూర్తిగా తెలీదు కానీ, ఆ వ్యవహరించిన ఈ తీరు మాత్రం ఫిలిం నగర్ లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : తెలుగు రాష్ట్రాలకు నెంబర్ వన్ హీరో అతనే..ప్రభాస్ కూడా అతని తర్వాతే : నిర్మాత సురేష్ బాబు
ఇండస్ట్రీ రామానాయుడు ఎన్ని సేవలు అందించాడో, సురేష్ బాబు కూడా అన్ని సేవలు అందించాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ బ్రాండ్ ని శిఖరాగ్ర స్థాయికి చేర్చాడు. ఈ బ్యానర్ నుండి ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి హీరోలు ఈ బ్యానర్ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యినవాళ్ళే. ఇదంతా సురేష్ బాబు విజన్, పట్టుదల, కచ్చితమైన తత్త్వం, క్రమశిక్షణ, నిబద్దత వంటి లక్షణాలు కారణంగానే సాధ్యం అయ్యాయి. ఇండస్ట్రీ లోనే అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న ప్రొడక్షన్స్ ఒకటి సురేష్ ప్రొడక్షన్స్. సురేష్ బాబు అంటే అందరికీ ఎంతో మంచి గౌరవం ఉంది. అలాంటి ఇమేజ్ ని సంపాదించుకున్న సురేష్ బాబు లాంటి వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో అదుపు తప్పుతారని ఇలాంటివి విన్నప్పుడే తెలుస్తూ ఉంటుంది.