Prabhas and Deepika Padukone : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie). ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం వెర్రిక్కిపోయి ఉన్నారు. ఎందుకంటే నేటి యువత ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాలు తీసే దర్శకులలో ఒకరైన సందీప్ వంగ(Sandeep Vanga) ఈ చిత్రానికి దర్శకుడు కాబట్టి. ప్రభాస్ లాంటి కటౌట్ ని ఇలాంటి డైరెక్టర్స్ వాడుకుంటేనే అద్భుతాలు జరుగుతాయని అందరూ అంటుంటారు. ఇలాంటి డ్రీం ప్రాజెక్ట్స్ కుదిరినప్పుడు హీరోలకు అతీతంగా సినీ అభిమానులు ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మన ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు అసలు కనిపించడం లేదు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం అవ్వడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో హీరోయిన్ రోల్ కోసం దీపికా పదుకొనే(Deepika Padukone) ఎంపిక అయ్యింది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
Also Read ; ప్రభాస్ కి హాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయా..?
క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఇక ఈ చిత్రానికి తిరుగే లేదని అభిమానులు అనుకున్నారు. కానీ అందుతున్న సమాచారం ఏమిటంటే ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుందట. కారణం సందీప్ వంగ డిమాండ్స్ కి దీపిక పదుకొనే ఒప్పుకోలేదు. ఈ చిత్రానికి ఆయన దీపికా నుండి భారీ డేట్స్ ని అడిగాడు. అంతే కాకుండా రోజుకి 8 గంటలు పని చెయ్యాలని డిమాండ్ పెట్టాడట. దీపిక కేవలం ఆరు గంటలు పని చేయడానికి మాత్రమే కుదురుతుందని చెప్పిందట. ఈ విషయం లో వాళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ ఏర్పడినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం దీపిక పదుకొనే 20 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తో పాటు, లాభాల్లో వాటాలు ఇవ్వాలని కోరిందట. 20 కోట్లు ఇవ్వడానికి సందీప్ వంగ సిద్దమే కానీ, లాభాల్లో వాటాలకు మాత్రం నో చెప్పాడట.
సందీప్ వంగ తన ప్రతీ సినిమాని తన సోదరుడి ‘భద్రకాళీ ప్రొడక్షన్స్’ మీదనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే నిర్మాత కూడా ఆయనే. అందుకే పారితోషికం విషయం లో కూడా చిన్నపాటి డిబేట్ దీపిక తో నడిచిందట. చివరికి చర్చలు విఫలం అవ్వడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయం లో సందీప్ వంగ డైలమా లో పడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఆ క్యారక్టర్ ని కేవలం దీపిక ని ఊహించుకొని రాసాడు. కేవలం ఆమె మాత్రమే చేయగలిగే పాత్ర అట ఇది. ఇప్పుడు ఆమె తప్పుకోవడంతో ఎవరిని తీసుకోవాలి అనే డైలమా లో పడ్డాడట. సాధ్యమైనంత వరకు రష్మిక ని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.
Also Read : మీడియా ముందుకు తొలిసారి దీపికా పదుకొనే కూతురు..త్వరలోనే విడుదల కాబోతున్న సెన్సేషనల్ వీడియో!