Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie) కోసం అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ రామ్ చరణ్(Global Star Ram Charan) ‘గేమ్ చేంజర్’ కోసం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంతే కాకుండా VFX పై భారీ ట్రోల్స్ రావడంతో మేకర్స్ ఈ మరింత జాగ్రత్తలు తీసుకోవడానికి సమయం తీసుకున్నారు. అయితే కొత్త విడుదల తేదీని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. జులై నెలలో విడుదల చేస్తారని ఒక టాక్ ఉంది కానీ, అది ఇంకా ఖరారు కాలేదు. కానీ నేడు మొదటి పాట ని విడుదల చేశారు. ఇక నుండి వరుసగా అప్డేట్స్ వస్తాయని అంటున్నారు. అంటే విడుదల దగ్గర్లో ఉన్నట్టే అని చెప్పేందుకు సూచనలు ఇవే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.
Also Read : ‘విశ్వంభర’ మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
అదేమిటంటే ఈ చిత్రంలో ఒక విచిత్రమైన ఫైట్ ఉంటుందట. ఈ ఫైట్ లో చిరంజీవి ఆరు మంది రాక్షసులతో పోరాటం చేస్తాడట. ఈ ఫైట్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని, చిన్న పిల్లలను ఈ పోరాట సన్నివేశం ప్రత్యేకంగా ఆకర్షిస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టుగానే ఉంటుందట. ఇలాంటి బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు విడుదలై ఇటీవల కాలంలో చాలా రోజులైందని, ఈ చిత్రం పై ప్రస్తుతం ఆశించిన స్థాయిలో అంచనాలు లేకపోవచ్చు కానీ, భవిష్యత్తులో విడుదల చేయబోయే ప్రమోషనల్ కంటెంట్ ని చూసిన తర్వాత అంచనాలు అమాంతం పెరిగిపోతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మెగా అభిమానులు ‘గేమ్ చేంజర్’ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఒకప్పుడు వన్ సైడ్ గా డామినేషన్ చేసిన మెగా ఫ్యామిలీ, ఇప్పుడు మిగిలిన హీరోలతో పోలిస్తే బాగా వెనుకబడింది.
అంతే కాకుండా సోషల్ మీడియా లో తరచూ ట్రోలింగ్స్ ని ఎదురుకుంటూనే ఉన్నారు. రామ్ చరణ్ కి ఈమధ్య కాలం లో సరైన సూపర్ హిట్ లేదు కానీ, చిరంజీవి కి 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్రం ఉంది. ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ వంటి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చిన ఈ చిత్రం అప్పట్లో 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత అదే ఏడాది విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రం మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక మెగా ఫ్యాన్స్ మొత్తం ‘విశ్వంభర’ మీదనే భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా కి బాగా నెగటివ్ అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : ‘విశ్వంభర’ చిత్రం నుండి మొదటి పాట ‘రామ రామ’ ప్రోమో వచ్చేసింది..!