Bigg Boss 9 : ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త సీజన్ కోసం అభిమానులు ఎంతలా ఎదురు చూస్తుంటారో మన అందరికీ తెలిసిందే. సీజన్ 8 ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకో లేకపోవడంతో 9వ సీజన్(Bigg Boss 9 Telugu) ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. టీవీ సీరియల్స్, సోషల్ మీడియా లో బాగా ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీస్ ని ఈ సీజన్ కోసం ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా ఈ సీజన్ లో పాత సీజన్ కి చెందిన కంటెస్టెంట్స్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోలింగ్స్ ని ఎదురుకునే ఉప్పల్ బాలు ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఇతను చూసేందుకు మగవాడిలాగానే ఉంటాడు, కానీ చేష్టలు మాత్రం చాలా తేడాగా ఉంటాయి.
Also Read : ‘బిగ్ బాస్ 9’ లోకి అలేఖ్య చిట్టి..రెమ్యూనరేషన్ ఈ రేంజ్ లో ఇస్తున్నారా!
ఇతని వీడియోస్ ని మీమ్స్ గా తెగ ఉపయోగిస్తూ ఉంటారు నెటిజెన్స్. ఇతను వేసే డ్యాన్స్ లు కూడా చాలా విచిత్రం గా ఉంటాయి. కానీ ఈమధ్య కాలంలో ఉప్పల్ బాలు కి నెమ్మదిగా పాజిటివిటీ పెరుగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేసే సెలబ్రిటీలు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులను ఎదురుకుంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఉప్పల్ బాలు(Uppal Balu) కి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమని భారీ ఆఫర్స్ వచ్చేవి అట. కానీ అతను చేయను అని ముఖం మీదనే చెప్పేవాడట. ఎందుకంటే అదంతా పాపం సొమ్ము. వాటిని తింటే అరగదు అని తనతో చెప్పినట్టు ‘నా అన్వేషణ’ అన్వేష్ ఇటీవలే ఒక వీడియో లో చెప్పడం బాగా వైరల్ అయ్యింది. అంతే కాకుండా తన కుటుంబ పరిస్థితుల గురించి ఉప్పల్ బాలు చెప్పిన కొన్ని విషయాలను చూస్తే ఇతనిలో చాల మెచ్యూరిటీ ఉందని తెలుస్తుంది.
ఇది వరకు ఉప్పల్ బాలు ని ఆడియన్స్ కేవలం మీమ్స్ కోసం ఉపయోగపడే ఒక ట్రోలింగ్ మెటీరియల్ గానే చూసారు. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆయనలోని అసలు సిసలు కోణాలను చూసే అవకాశం ఉంటుంది. ఉప్పల్ బాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాగానే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉప్పల్ బాలు కి వారానికి రెండు లక్షలు ఇవ్వడానికి బిగ్ బాస్ యాజమాన్యం అంగీకరించినట్టు తెలుస్తుంది. అయితే ఉప్పల్ బాలు కూడా మరో పల్లవి ప్రశాంత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ కూడా ఒకప్పుడు సోషల్ మీడియా లో అత్యధిక ట్రోల్ల్స్ ని ఎదురుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన బిగ్ బాస్ లోకి వచ్చాడో, అప్పటి నుండి అతని ఇమేజ్ మారిపోయింది. ఉప్పల్ బాలు కి కూడా అలా తన ఇమేజ్ ని మార్చుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది.