spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Rajesh Neelam VS Vishvak Sen : బేబీ డైరెక్టర్ కి విశ్వక్ సేన్ కౌంటర్..?...

Sai Rajesh Neelam VS Vishvak Sen : బేబీ డైరెక్టర్ కి విశ్వక్ సేన్ కౌంటర్..? అది మగాళ్లకు కూడా వర్తిస్తుంది అంటూ ట్వీట్!

Sai Rajesh Neelam VS Vishvak Sen : విశ్వక్ సేన్ వివాదాలకు మారుపేరు. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ యాటిట్యూడ్ హీరో పలుమార్లు వివాదాలతో వార్తల్లో నిలిచాడు. ఫలక్ నుమా దాస్ మూవీ పోస్టర్స్ చించేశారని పెద్ద రచ్చ చేశాడు. హీరో విజయ్ దేవరకొండ కుట్ర అంటూ నేరుగా విమర్శలు చేశాడు. ఆ వివాదం మెల్లగా సద్దుమణిగింది. ఫలక్ నుమా దాస్ చిత్రానికి ఆ వివాదం ప్లస్ అయ్యింది. ఎంతో కొంత వసూళ్లు తెచ్చిపెట్టింది. అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలకు ముందు మరో వివాదం రేపాడు. 

 
లక్ష్మణ్ అనే వ్యక్తితో రోడ్డు పక్కన ఫ్రాంక్ చేసి విమర్శల పాలయ్యారు. పబ్లిక్ లో ఈ రచ్చ ఏంటంటూ సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ ని ఏకిపారేశారు. టీవీ 9 దేవీ నాగవల్లి స్టూడియో నుండి గెట్ అవుట్ అంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా విశ్వక్ సేన్ ఒక ట్వీట్ చేశారు. సదరు ట్వీట్లో… వద్దు అంటే వద్దు అనేది మగాళ్లకు కూడా వర్తిస్తుంది. అందుకే హైరానా పడిపోకుండా శాంతియుతంగా ఉండండి. మనం ప్రశాంత వాతావరణంలో బ్రతుకుతున్నాం.. అని కామెంట్ చేశాడు. 
 
ఇది బేబీ దర్శకుడు సాయి రాజేష్ కి కౌంటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బేబీ చిత్ర సక్సెస్ మీట్లో సాయి రాజేష్ ఈ కథను ఓ హీరోకి చెప్పడానికి ట్రై చేస్తే అసలు వినడానికి కూడా ఇష్టపడలేదని అన్నారు. సాయి రాజేష్ చెప్పిన ఆ హీరో విశ్వక్ సేన్. సక్సెస్ మీట్లో పరోక్షంగా విశ్వక్ నా కథ కనీసం వినలేదు. బ్లాక్ బస్టర్ మిస్ అయ్యాడని ఎద్దేవా చేశాడని భావించిన విశ్వక్, ఇలా కౌంటర్ వేశాడన్న మాట వినిపిస్తోంది. 
 
టాలీవుడ్ లో ఇది తాజా వివాదం అని చెప్పొచ్చు. విశ్వక్ సేన్ ట్వీట్ కి సాయి రాజేష్ స్పందిస్తే ప్రచారం అవుతున్నది నిజమే. సాయి రాజేష్ కథ వినని ఆ హీరో విశ్వక్ సేన్ అని ఫిక్స్ కావచ్చు. విశ్వక్ ఫ్యాన్స్ మాత్రం బేబీ చేయకుండా మంచి పని చేశావు. సాయి రాజేష్ ఏదో టైటానిక్ తెరకెక్కించినట్లు ఫీల్ అవుతున్నాడని మద్దతుగా నిలుస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ మూవీ భారీ వసూళ్లు సాధించింది. 
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version