Bigg Boss 8 Telugu: ఈ సీజన్ లో కొంతమంది కంటెస్టెంట్స్ కి మానవత్వం అనేదే లేదు అని చూసే ప్రేక్షకులకు అనిపిస్తుంది. గత సీజన్స్ లో ఎప్పుడూ కూడా ఇలాంటి కంటెస్టెంట్స్ ని ఆడియన్స్ చూడలేదు. యష్మీ టీం మొత్తం నిన్న నైనిక టీం కి క్లీనింగ్ డిపార్ట్మెంట్ పనులు చెప్పి వాళ్ళ ముందు చాలా యాటిట్యూడ్ తో ప్రవర్తించారు. చివరికి చెత్తలో వేసిన త్రాగే వస్తువులను కూడా తీసి బయట పెట్టారు. తినేసి ప్లేట్స్ ఎక్కడ పడితే అక్కడ వదిలేసి నైనిక టీం ని టార్చర్ కి గురి చేసారు. మరోపక్క నైనిక టీం లో విష్ణు ప్రియా కూడా ఏమి తక్కువ కాదు. యష్మీ టీం సభ్యులు చేసిన ఓవర్ యాక్షన్ మొత్తం ఈమె ఒక్కటే చేసి చూపించింది ఈరోజు. ముందుగా సోనియా వద్దకు వెళ్లి మొదట్లో నీకు, మణికంఠ కి అసలు పడేది కాదు కదా, ఇప్పుడు మీరిద్దరూ బాగా కలిసిపోయినట్టు అనిపిస్తుంది, దీనికి మీరేమి సమాధానం ఇస్తారు అని సోనియా ని ఫన్నీ గా అడుగుతుంది.
సోనియా కూడా ఫన్నీ గానే ‘నో కామెంట్స్’ అని నవ్వుతూ సమాధానం చెప్పింది. చాలా సేఫ్ గా ఆడుతున్నావ్ కదా అని సోనియా ని విష్ణు ప్రియా అనగా, సోనియా లేచి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సీరియస్ గా మాట్లాడుతూ ‘నువ్వు అడల్ట్ జోక్స్ నా మీద వెయ్యకు’ అని ఘాటుగా సమాధానం చెప్తుంది. అప్పుడు విష్ణు ప్రియా నేనేమి అలాంటి ఉద్దేశ్యంతో మాట్లాడలేదు, ఒకవేళ మీరు బాధపడుతుంటే క్షమించండి అని అంటుంది. అక్కడితో ఆ మ్యాటర్ వదిలేసి ఉండుంటే విష్ణు ప్రియా కి చాలా గౌరవం దక్కేది. కానీ అలా చెయ్యలేదు. ముందుగా సోనియా మరియు అభయ్ మాట్లాడుకుంటున్న సమయం లో సీత వెళ్లి సోనియా వివరిస్తూ నేను నిజంగా విష్ణు ప్రియా కి అలా చెయ్యమని చెప్పలేదు, దయచేసి నన్ను క్షమించు అని అంటుంది, అలా వాళ్ళ మధ్య మంచిగా డిస్కషన్ నడుస్తున్న సమయంలో విష్ణు ప్రియా కోపం తో సోనియా ఉంటున్న రూమ్ లోకి దూసుకొచ్చేసింది. నేను అనని మాటని అన్నాను అని చెప్పి నా మీద కొన్ని మాటలు వదిలేసావు, నేనేమి నువ్వు మణికంఠ బాగా ఒకరికొకరు కలిసిపోయారు, మీ మధ్య ఎదో జరుగుతుంది లాంటి మాటలు మాట్లాడలేదు, కేవలం కామెడీ కోసం మాట్లాడాను అని అంటుంది అంటుంది.
దీనికి కోపం తెచ్చుకున్న సోనియా ‘జస్ట్..స్టాప్ ఇట్..ఏమి మాట్లాడుతున్నావు’ అంటూ విష్ణు ప్రియా పై అరుస్తుంది. అలా వాళ్ళ మధ్య పెద్ద గొడవ జరిగిన తర్వాత సోనియా అభయ్ తో మాట్లాడుతూ జరిగిన సంఘటన తలచుకొని ఏడ్చేస్తుంది. అప్పుడే బయటకి వచ్చిన విష్ణు ప్రియా ఏడవాలి అనుకుంటే నేను కూడా ఏడుస్తాను, ఒక అమ్మాయి అయ్యుండి మరో అమ్మాయి మీద అడల్ట్ జోక్స్ వేసింది అని అబద్దపు పుకార్లు పుట్టించొచ్చా, పెద్ద దిగి వచ్చింది పుణ్య స్త్రీ అంటూ కనీసం ఏడుస్తుంది అనే జాలి కూడా చూపించకుండా తన శాడిజం మొత్తాన్ని చూపించేసింది, దీనిపై నాగార్జున కూడా ఫైర్ అయ్యాడు.