Bigg Boss 8 Telugu: మొదటి రోజు నుండి మొదటి వారం ముగిసేవరకు ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ కొట్లాట మధ్యనే నడిచింది. చూసేందుకు చాలా సాఫ్ట్ గా అనిపించిన అనేక మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా మాస్కులు విప్పేసారు. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటిరోజు నుండి చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తో తన తోటి కంటెస్టెంట్స్ మెలిగిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది బెజవాడ బేబక్క అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈరోజు ఆమె తన విశ్వరూపం చూపేసింది. తన క్లాన్ చీఫ్ నిఖిల్ పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిఖిల్ లో ఒక్క గొప్ప లీడర్ షిప్ క్వాలిటీ ని చూసి, అతని టీం లోకి ఎంతో ఇష్టపడి నేను వెళ్లాను, కానీ అదే ఇష్టంతో ఆయన నన్ను టీం లోకి ఆహ్వానించలేదు. నాకంటే అతనికి సోనియా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించిందట.
సోనియా హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క టాస్కు కూడా ఆడలేదు, నేనైనా పలు టాస్కులు ఆడాను, నా కెపాసిటీ కొంచమైనా తెలిసి ఉంటుంది, కానీ నిఖిల్ సోనియా ఎలా ఆడుతుందో తెలియకముందే ఆమెని నాకంటే స్ట్రాంగ్ అని ఎలా నమ్మాడు అంటూ నాగార్జున ముందు తన బాధని వ్యక్తపరిచింది. ఈ విషయంపై నేటి ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మేట్స్ తో మాట్లాడక ముందు నిఖిల్ మరియు బెజవాడ బేబక్క మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. నిఖిల్ కాస్త నోరు జారీ అభయ్ ముందు బెజవాడ బేబక్క ని లాగిపెట్టి కొట్టాలని అనిపించింది అని చెప్పుకొస్తాడు. ఇక ఆ తర్వాత బేబక్క నాగార్జున తో తన బాధని మొత్తం చెప్పుకుంటూ నాకు, సోనియా కి సరిగా కుదరడం లేదు, నిఖిల్ తో మా మధ్య ఉన్న సమస్యని కూర్చొని మాట్లాడి సెటిల్ చేయించు అని అడిగాను, కచ్చితంగా చేస్తాను, కానీ ఇప్పుడు కాదు అన్నాడు, దాని గురించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు, అందుకే నేను పరోక్షంగా నైనిక టీం కి వెళ్ళిపోతాను అని ఆ టీం మెంబెర్స్ ని అడిగాను అంటూ చెప్పుకొచ్చింది బేబక్క.
ఆ తర్వాత నాగార్జున ఇలాంటి టీం లో నువ్వు కొనసాగాలని అనుకుంటున్నావా అని బేబక్క ని అడగగా, లేదు సార్, నేను ఈ బ్యాండ్ ని తెచ్చేస్తున్నాను అంటూ తెంచేసింది. ఇక ఆ తర్వాత నాగార్జున బేబక్క ఏ టీం లోకి వెళ్ళాలి అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు అని అంటాడు. నైనిక టీం , యష్మీ టీంతో పోలిస్తే తక్కువ ఉంది కాబట్టి, బేబక్క ని నైనిక టీం లోకి పంపే అవకాశం ఉంది. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బేబక్క ఈ వారం ఎలిమినేట్ అయ్యిందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే పాపం బేబక్క రియాక్షన్ ఏమిటో, ఇప్పుడే మాస్క్ తీసిన ఆమె రియల్ గేమ్ లోకి ఎంటర్ అయ్యింది అనుకునేలోపు ఎలిమినేట్ అయిపోయింది.