Vishnu Vinyasam Box Office Collection: గత నెల విడుదలైన సినిమాల్లో కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలినవే ఎక్కువ ఉన్నాయి. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి సమయం లో మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ స్థాయికి చేరుకున్న సినిమా ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam). శ్రీ విష్ణు(Sree Vishnu) హీరో గా నటించిన ఈ సినిమా కి మొదటి నుండే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. కారణం శ్రీ విష్ణు గత రెండు చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్స్ అవ్వడమే. పైగా ఆయన తన సినిమాల్లో జెన్ జీ ఆడియన్స్ కి తగ్గట్టుగా పెట్టే డైలాగ్స్ కి ఉండే డిమాండ్ మామూలుది కాదు. ఇవన్నీ కలిసి రావడం వల్లే ‘విష్ణు విన్యాసం’ చిత్రానికి బ్రేక్ ఈవెన్ అయ్యే రేంజ్ వసూళ్లు వచ్చాయి.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
దాదాపుగా అన్నీ ప్రాంతాల్లోనూ థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , వరల్డ్ వైడ్ గా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే , నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి క్లోజింగ్ లో 5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. గ్రాస్ అయితే 10 కోట్ల 30 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. డివైడ్ టాక్ తో ఈ రేంజ్ రావడం అనేది చిన్న విషయం కాదు.
మొత్తం మీద ఈ చిత్రానికి 7 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. విడుదలకు ముందు ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 6 కోట్ల 50 లక్షల వరకు ఉంటుంది. అంటే బయ్యర్స్ కి దాదాపుగా 60 లక్షల రూపాయిల లాభాలు ఈ చిత్రం ద్వారా వచ్చాయి అన్నమాట. ఈ రేంజ్ వసూళ్లు శ్రీ విష్ణు నుండి వస్తుందని ఆడియన్స్ అసలు ఊహించలేదు. సంక్రాంతి తర్వాత బాగా డ్రై గా మారిన బాక్స్ ఆఫీస్ కి ఈ చిత్రం కాస్త ఊపిరి పోసింది అనే చెప్పాలి.
