Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తనకి హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో లైఫ్ లో సినిమా చేయను అని చెప్పడానికి కారణం ఏంటి..?

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ని పోషిస్తాడో తన నిజ జీవితంలో కూడా తను అంతే నిజాయితీగా అంతే పవర్ఫుల్ డైలాగులను చెబుతూ ఎవ్వరికీ భయపడకుండా చాలా గర్వంగా ఉంటాడు.

Written By: Gopi, Updated On : November 24, 2023 2:32 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: చిరంజీవి తమ్ముడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలుసు… ఆయన చేసిన సినిమాలు గాని, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు గాని చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకే పవన్ కళ్యాణ్ కి సినిమాల పరంగా కంటే కూడా ఆయన వ్యక్తిత్వం పరంగా ఆయనకి అభిమానులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు ఆయన వంతుగా ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఇక తన సహాయం అనేది పెద్ద స్థాయిలో ఉండాలనే ఉద్దేశ్యం తోనే జనసేన అనే పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా తను ముందుకు కదులుతున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ని పోషిస్తాడో తన నిజ జీవితంలో కూడా తను అంతే నిజాయితీగా అంతే పవర్ఫుల్ డైలాగులను చెబుతూ ఎవ్వరికీ భయపడకుండా చాలా గర్వంగా ఉంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ ని అభిమానించే అభిమానులు కూడా చాలా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు…

ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఖుషి సినిమాతో మొదటి ఇండస్ట్రీ కొట్టారు. అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ఎస్ జె సూర్య కి పవన్ కళ్యాణ్ మధ్య మంచిర్యాపో ఉండేది. దానివల్లనే వాళ్లిద్దరి కాంబినేషన్ లో పులి అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య ఉన్న మంచి స్నేహబంధం వల్ల వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే ఎస్ జె సూర్య డైరెక్షన్ చేయడం పక్కన పెట్టీ నటుడిగా సినిమాల్లో యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. తను అనుకున్న దానికంటే ఎక్కువ రేంజ్ లో నటుడిగా క్లిక్ కావడంతో ఆయన డైరెక్షన్ ని పక్కన పెట్టేసి యాక్టింగ్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడు అందులో భాగంగానే ఆయన చేసిన సినిమాలకి అతనికి ఉత్తమ నటుడు గా నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి.ఇక అప్పుడు డైరెక్షన్ ని మొత్తానికి పక్కన పెట్టేసి నటుడు గా కొనసాగాలి అనుకున్నాడు…

అయితే మధ్యలో ఒక మంచి కాన్సెప్ట్ అనేది అతనికి స్ట్రైక్ అవ్వడంతో ఆ కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ కి చెప్పాడు. పవన్ కళ్యాణ్ కి కూడా ఆ స్టోరీ నచ్చి సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ అతనికున్న కమిట్ మెంట్స్ వల్ల పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేయలేకపోయాడు. దాంతో అప్పుడు పవన్ కళ్యాణ్ తమిళంలో వచ్చిన వీరమ్ సినిమాని తెలుగులో కాటమ రాయుడు సినిమా పేరుతో రీమేక్ చేయాలనుకున్నాడు అయితే ఆ సినిమా డైరెక్షన్ భాద్యతలను ఎస్ జె సూర్యకు అప్పగించాలని చూశాడు.

అలా సూర్య కూడా నేను ఈ సినిమా చేస్తాను అని ఒప్పుకున్నాడు. తీరా సమయానికి మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ సినిమాలో విలన్ గా అవకాశం రావడంతో పవన్ కళ్యాణ్ తో చేస్తానని కమిటీ అయిన కాటమ రాయుడు సినిమాని వదిలేసి స్పైడర్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. దాంతో పవన్ కళ్యాణ్ ఎస్ జే సూర్య తో ఇక లైఫ్ లో సినిమా చేయను అని చెప్పి ఆ సినిమాకి ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల అనే సినిమా తీసిన డైరెక్టర్ డాలీ ని తీసుకున్నాడు… ఎస్ జె సూర్యకి, పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం అనేది అలా పెరిగింది…