Vishnu Manchu Kannappa Advance Booking Status: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ గా మొదలు పెట్టి, ఎన్నో కష్టనష్టాలను ఎదురుకొని పట్టుదలతో నిర్మించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా గురించి మంచి విష్ణు ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఎంత గొప్పగా చెప్పాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో కూడా చెప్పాడు. మంచు విష్ణు ఎప్పుడూ ఇలా అతిశయోక్తి గానే మాట్లాడుతాడు కదా, అందులో కొత్తేమి ఉంది అని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ విడుదలైందో, అప్పటి నుండి ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. సినిమాలో విషయం ఉన్నట్లుందే అని ప్రతీ ఒక్కరు అనుకునేలా చేసింది ఆ థియేట్రికల్ ట్రైలర్.
అయితే నేడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైంది. ముందుగా హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ స్క్రీన్ లో బుకింగ్స్ ప్రారంభించారు. ఎవ్వరూ ఊహించని విధంగా, బుకింగ్స్ మొదలెట్టిన నిమిషాల వ్యవధిలోనే లార్జ్ స్క్రీన్ హౌస్ ఫుల్ అయిపోయింది. మిగిలిన షోస్ కి సంబంధించిన టికెట్స్ కూడా బాగానే అమ్ముడుపోయాయి. మంచు విష్ణు గత చిత్రాలకు సంబంధించి దేనికి కూడా ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం గమనార్హం. ఇదంతా ప్రభాస్(Rebel Star Prabhas) స్టార్ స్టేటస్ కారణంగానే జరిగిందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఓవర్సీస్ లో కూడా రెండు రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు . ఈ రెండు రోజుల్లో ఈ చిత్రానికి 480 టిక్కెట్లు అమ్ముడుపోగా పది వేలకు పైగా అమెరికన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మంచు విష్ణు గత చిత్రం జిన్నా కి ఇక్కడ కనీసం క్లోజింగ్ లో కూడా వెయ్యి డాలర్లను రాబట్టలేకపోయింది.
Also Read: Manchu Vishnu : నా తమ్ముడు నా పతనం కోరుకున్నాడు..ప్రభాస్ కి రుణపడి ఉంటాను – మంచు విష్ణు
అలాంటిది ఇప్పుడు కేవలం ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పది రెట్లు ఎక్కువ వచ్చాయి. అంతే కాకుండా ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ లక్ష డాలర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదంతా ప్రభాస్ మాస్ అనే అనుకోవాలి . ఒకవేళ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ మంచి పవర్ ఫుల్ గా వచ్చి ఉండుంటే మాత్రం ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ దక్కడం పక్కా. మంచు విష్ణు కలలో కూడా చూడని ఓపెనింగ్స్ ఈ చిత్రానికి మంచు విష్ణు చూడొచ్చు. ఒకవేళ సినిమా బాగుంటే మంచు విష్ణు పంట పండినట్టే అనుకోవాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ చిత్రం లో రెబెల్ స్టార్ ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్,మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖులంతా ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించారు.