Vishal Sai Dhansika : తమిళ హీరో విశాల్(Vishal Reddy) రీసెంట్ గానే ప్రముఖ యంగ్ హీరోయిన్ సాయి ధన్సిక(Sai Dhansika) తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. సాయి ధన్సిక అంటే ఆమెని గుర్తు పట్టలేరేమో కానీ, సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కబాలి’ చిత్రం లో ఆయన కూతురుగా నటించిన అమ్మాయి అంటే మాత్రం కచ్చితంగా అందరూ గుర్తు పడుతారు. ఈ చిత్రం తర్వాత ఆమె అనేక సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అనేక సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. కానీ పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. గత రెండేళ్ల నుండి విశాల్ తో ప్రేమాయణం నడుపుతూ డేటింగ్ లో ఉన్న ధన్సిక రీసెంట్ గానే నిశ్చితార్థం చేసుకొని, మరో రెండు నెలల్లో పెళ్లి కూడా చేసుకోనున్నారు. ఇదంతా పక్కన పెడితే విశాల్ కి సాయి ధన్సిక కంటే ముందు కోలీవుడ్ లో అనేక మంది హీరోయిన్స్ తో డేటింగ్ చేసాడు అనే విషయం మీకు తెలుసా..?
సౌత్ లో ప్రస్తుతం లేడీ విలన్ గా మంచి డిమాండ్ ఉన్నటువంటి వరలక్ష్మి శరత్ కుమార్ తో గతం లో ఆయన చాలా కాలం వరకు ప్రేమాయణం నడిపాడు. వీళ్ళ ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చింది, కానీ మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ క్యాన్సిల్ అయ్యింది. ఇక ఆ తర్వాత విశాల్ అనిషా అల్లా రెడ్డి అనే మరో యంగ్ తమిళ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపాడు. 2019 వ సంవత్సరం లో వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఈ నిశ్చితార్థం కూడా కొన్ని కారణాల చేత రద్దు అయ్యింది. ఈ రెండు వ్యవహారాలకు ముందు గతం లో ఆయన హన్సిక తో కూడా ప్రేమాయణం నడిపాడు అనే రూమర్స్ కోలీవుడ్ లో చాలా బలంగా వినిపించేవి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. చివరికి సాయి ధన్సిక వద్దకు వచ్చి ఆగాడు. కనీసం ఈమెతో అయినా మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తాడా?, లేదంటే ఇంతకు ముందు లాగానే చేస్తాడా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.