https://oktelugu.com/

Vishal Marriage: ఆ స్టార్ హీరోయిన్ తో పెళ్ళికి సిద్ధమైన విశాల్!

వరలక్ష్మి బ్రేకప్ అనంతరం ఒకరిద్దరు హీరోయిన్స్ తో విశాల్ ఎఫైర్స్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ మీనన్, విశాల్ రిలేషన్ లో ఉన్నారని గట్టిగా వినిపించింది. లక్ష్మీ మీనన్-విశాల్ కలిసి రెండు చిత్రాలు చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : August 8, 2023 / 04:43 PM IST

    Vishal Marriage

    Follow us on

    Vishal Marriage: కోలీవుడ్ లో ఎదిగిన తెలుగు వాడు విశాల్. అక్కడి సినిమా రాజకీయాలను కూడా శాసించాడు. నడిగర్ సంఘం మీద ఆధిపత్యం సాధించాడు. ఈ క్రమంలో కోలీవుడ్ అతడి పెత్తనాన్ని ఒప్పుకోలేదు. భారతీరాజా, శరత్ కుమార్, రాధిక వంటి పెద్దలు విశాల్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. విశాల్ మీద కొన్ని కేసులు ఉన్నాయి. చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. నటి వరలక్ష్మితో విశాల్ కొన్నేళ్లు రిలేషన్ లో ఉన్నాడు. వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా విడిపోయారు.

    వరలక్ష్మి బ్రేకప్ అనంతరం ఒకరిద్దరు హీరోయిన్స్ తో విశాల్ ఎఫైర్స్ నడిపారనే పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా లక్ష్మీ మీనన్, విశాల్ రిలేషన్ లో ఉన్నారని గట్టిగా వినిపించింది. లక్ష్మీ మీనన్-విశాల్ కలిసి రెండు చిత్రాలు చేశారు. పలనాడు, ఇంద్రుడు చిత్రాల్లో జతకట్టారు. అప్పుడే ఎఫైర్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ వార్తలను లక్షీ మీనన్ ఖండించింది. తర్వాత వీరిద్దరూ కలిసి నటించింది లేదు. అయితే మరలా వీరి ఎఫైర్ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

    కోలీవుడ్ మీడియా వర్గాల ప్రకారం త్వరలో విశాల్-లక్ష్మీ మీనన్ వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల పెద్దలు ఇందుకు అంగీకారం తెలిపారట. త్వరలో వివాహమే అంటున్నారు. అప్పుడు మొదలైన రిలేషన్ ఇంకా కొనసాగుతుందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా 2019లో విశాల్ హైదరాబాద్ కి చెందిన అనిషా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

    కారణం తెలియదు కానీ అనిషా రెడ్డి-విశాల్ విడిపోయారు. ఆ పెళ్లి రద్దు అయ్యింది. అప్పటి నుండి సినిమాల్లో బిజీగా ఉంటున్న విశాల్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ ని వివాహం చేసుకోబోతున్నాడనే ప్రచారం మొదలైంది. ఇక విశాల్ చదరంగం, పందెం కోడి, భరణి వంటి చిత్రాలతో తెలుగులో కూడా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య విశాల్ చిత్రాలు తెలుగులో ప్రభావం చూపడం లేదు. వరుస పరాజయాలతో అతడి మార్కెట్ ప్రమాదంలో పడింది.