Vishal : ఇప్పటివరకు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇదిలా ఉంటే విశాల్ కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విక్రమ్ తర్వాత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు విశాల్… ప్రస్తుతం ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. తను చేసిన ‘పందెంకోడి’ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడంతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ఆయన ఇప్పటికి సిద్ధంగా ఉన్నాడు. ఇక రీసెంట్ గా ఆయన ‘ మదగదరాజ ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ ఈవెంట్లో ఆయన చాలావరకు వణుకుతూ, నడవలేక నడుస్తున్న పరిస్థితిని ప్రతి ఒక్కరు గమనించారు. మరి అతను అలా ఎందుకు అయిపోయాడు. దానివల్లే ఆయన ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆయన ‘వాడు వీడు’ సినిమా సమయంలో డూప్ లేకుండా చెట్టు మీద నుంచి దూకడం వల్ల అతని తలకు బలమైన దెబ్బ తగిలింది. దానివల్ల అతని బ్రెయిన్ లో ఉన్న నరాలు కొంతవరకు డ్యామేజ్ అయ్యాయి. దానివల్లే ఆయన సరిగ్గా నడవలేక పోతున్నాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ప్రస్తుతం అతనికి స్మెల్, టేస్ట్ లేకుండా పోయాయట. అలాగే ఆయనకు విపరీతమైన తలనొప్పి కూడా వస్తుందట. మరి ఏది ఏమైనా కూడా ఆయన దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. కాబట్టి తొందర్లోనే ఆయన కోలుకొని మరికొన్ని సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…
ఇక ఇదిలా ఉంటే అప్పట్లో విశాల్ ను టార్గెట్ చేసి కొంతమంది హీరోలు, రాజకీయ నాయకులు అతన్ని తొక్కేయాలనే విషయం మనకు తెలిసిందే. అయితే అతన్ని తొక్కేయాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేశారు. ఇక ఒక నటిమని విశాల్ తనకి అవకాశం ఇస్తానని చెప్పి తనను వాడుకున్నాడు అంటూ పెను సంచలనాలను సృష్టించే కామెంట్లు చేయడంతో అనీషా రెడ్డి తో పెళ్లి దాకా వచ్చిన ఆయన వ్యవహారం ఆగిపోయిందని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం విశాల్ పరిస్థితి ఇలా ఉంది. ఇక మొత్తానికైతే అటు రాజకీయ నాయకులు ఇటు నటీనటులు అందరూ అతన్ని చాలావరకు తొక్కేసే ప్రయత్నం అయితే చేశారు. దానివల్లే ఆయన సినిమా రంగం లో గాని, రాజకీయంగా గానీ అతను కోలుకోలేకుండా పోతున్నాడని మరి కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు…