https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ఊహించని షాక్..ఆందోలనలో అభిమానులు!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 9, 2025 / 09:40 AM IST

    Game Changer

    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మాణం అయిన సినిమా కావడం తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ చిత్రానికి హైక్ రేట్స్ ఇస్తూ జీవోలను జారీ చేసాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో టికెట్ రేట్స్ పెంపుకి నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఇది రూల్స్ ప్రకారం విరుద్ధం అంటూ పిల్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హై కోర్టు, కేవలం 10 రోజులకు మాత్రమే టికెట్ హైక్స్ ని పరిమితం చేయాలనీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ జీవో ప్రకారం పెంచిన టికెట్ రేట్స్ 14 రోజుల వరకు వర్తిస్తాయి. ఇప్పుడు దానిని 10 రోజులకు కుదించాలి.

    ‘డాకు మహారాజ్’ , ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి బెనిఫిట్ షోస్ కి గాను 600 రూపాయిల టికెట్ రేట్స్ పెట్టుకోవచ్చని, అదే విధంగా మల్టీ ప్లెక్స్ థియేటర్స్ కి ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్స్ పై 135 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్ కి 110 రూపాయిలు పెంచుకోవచ్చని జీవోలో జారీ అయ్యింది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి ఈ టికెట్ రేట్స్ మీద భారీ గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. బెనిఫిట్ షోస్ అన్ని ప్రాంతాల్లో హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. ఇది వరకు ఎన్నడూ చూడని రేంజ్ ట్రెండ్ ఈ సినిమాకి కనిపిస్తుంది. ఊపు చూస్తుంటే ఈ చిత్రానికి 24 గంటల్లో కేవలం బుక్ మై షో యాప్ నుండి 1 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు కేవలం కల్కి, పుష్ప 2 కి మాత్రమే ఈ రేంజ్ ట్రెండ్ కనిపించింది.

    పెరిగిన టికెట్ రేట్స్ పై జనాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని ఈ బుకింగ్స్ ని చూసి అనుకోవాలా?, సినిమాలు రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ ఎంత పెట్టి అయినా చూస్తారు, అందుకే ఈ చిత్రానికి టికెట్ రేట్స్ తో సంబంధం లేకుండా బుకింగ్స్ జరుగుతున్నాయి, రెండవ రోజు వసూళ్లు భారీగా తగ్గొచ్చు అని మరో వాదన కూడా వినిపిస్తుంది. సామాన్య ప్రజలు పండుగ రోజున ఒక సినిమా చూడాలంటే ఇప్పుడు కనీసం రెండు వేల రూపాయిలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దేవర, కల్కి , పుష్ప 2 చిత్రాలకు ఖర్చు చేసారు. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ కి ఖర్చు చేయబోతున్నారు. అందుకే ప్రభుత్వాలు కూడా తమకి టాక్స్ రూపం లో భారీ లాభం చేకూరుతుందని అనుమతులు ఇచ్చేస్తున్నారు. కాబట్టి టికెట్ హైక్స్ వల్ల జనాల మీద ఎక్కువ భారం పడుతుంది అని కొంతమంది వాదిస్తున్న దాంట్లో అర్థం లేదని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.