రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ సంస్థ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 21 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రూల్స్ ప్రకారం సంబంధిత క్రీడలలో సాధించిన విజయాలను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు 50 మార్కులను కేటాయించడం జరుగుతుంది. విద్యార్హతల ఆధారంగా మిగిలిన 10 మార్కులను కేటాయిస్తారు. ది అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్, ఆర్‌ఆర్‌సీ, సదరన్ రైల్వే థార్డ్ ఫ్లోర్, నెం 5, చెన్నై 600008 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని సమాచారం.
https://sr.indianrailways.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.