ఎంటర్టైన్మెంట్Virupaksha movie collection : హిందీ లో 'విరూపాక్ష' కి మిశ్రమ స్పందన..ఇప్పటి వరకు వచ్చిన...

Virupaksha movie collection : హిందీ లో ‘విరూపాక్ష’ కి మిశ్రమ స్పందన..ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు ఇంతేనా!

Virupaksha movie collection : సాయి ధరమ్ తేజ్ హీరో గా అంటించిన లేటెస్ట్ చిత్రం విరూపాక్ష ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే.బైక్ యాక్సిసెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చాలా గట్టి కం బ్యాక్ ఇచ్చాడనే చెప్పాలి.రెండు వారాలు పూర్తి చేసుకొని మూడవ వారం లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, ఇప్పటి వరకు 45 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు అని చెప్పొచ్చు, హారర్ థ్రిల్లర్ జానర్ లో చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ అనుభూతి కలిగింది ఈ సినిమాతోనే.ఇప్పటికీ ఈ చిత్రం తెలుగు లో మంచి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది.అయితే ఈమధ్య కాలం లో కంటెంట్ బాగున్న సినిమాలు ఇతర బాషలలో కూడా కుమ్మేస్తున్న సంగతి తెలిసిందే.అందుకే విరూపాక్ష చిత్రాన్ని రెండు రోజుల క్రితం హిందీ ,తమిళం మరియు మలయాళం బాషలలో విడుదల చేసారు.

అయితే ఇతర బాషలలో తెలుగులో వచ్చినంత సెన్సషనల్ రెస్పాన్స్ లో పావు శాతం కూడా రాలేదు. హిందీ మరియు తమిళం బాషలలో ఒక సినిమా బాగా ఆడాలంటే కంటెంట్ బాగుంటే సరిపోదు, టైమింగ్ మరియు అదృష్టం కూడా కలిసి రావాలి.ఈ రెండు విరూపాక్ష చిత్రానికి కలిసి రాలేదు, అందుకే ఇతర బాషలలో క్లిక్ కాలేదు.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఇతర భాషలు కలిపి కేవలం 55 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.

విడుదలకు ముందు ప్రొమోషన్స్ అయితే బాగా చేసారు కానీ, అది ఇంకా ముందుగా ప్రారంభించి ఉంటే కరెక్ట్ గా ఉండేది అని విశ్లేషకుల అభిప్రాయం.అయితే ఓటీటీ లో విడుదలైనప్పుడు మాత్రం ఈ చిత్రానికి కచ్చితంగా ఇతర బాషలలో కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ వస్తుంది అని చెప్పొచ్చు.ఇక సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘వినోదయ్యా చిత్తం’ రీమేక్ జులై 28 వ తారీఖున విడుదల కాబోతుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper
Exit mobile version