Jyothi Rai: వీళ్ళు సీరియల్స్ లో తల్లి, అత్త పాత్రలతో కూడా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. బుల్లితెరపై సీరియల్స్ కు ఉండే ప్రత్యేకమైన క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్లు సీరియల్స్ ఎంతో ఇష్టంగా చూస్తారు. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బుల్లితెర మీద పలు ప్రముఖ చానల్స్ లో పదుల కొద్ది సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ సీరియల్స్ లో నటించే నటీనటులకు సినిమా హీరో హీరోయిన్ల కు మించిన ఫాలోయింగ్ ఉంది. తమ అందం, అభినయంతో సీరియల్ హీరోయిన్లు బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. అలాగే సీరియల్స్ లో హీరోయిన్ పాత్రలో కాకుండా తల్లి లేదా అత్త పాత్రలతో పాపులర్ అయిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు.
Also Read: ‘ఫౌజీ’ లో హీరోయిన్ మార్పు..రీ షూట్ తప్పేలా లేదు..కోట్ల రూపాయిల నష్టం!
వాళ్లు సీరియల్ లో తల్లి పాత్రలో ఉన్నప్పటికీ బయట మాత్రం గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం సీరియల్లో తల్లి పాత్రలో కనిపించిన ఒక నటి సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ ఫోటోలతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బుల్లితెర మీద ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సీరియల్కు శుభం కార్డు కూడా పడిపోయింది. ఈ సీరియల్లో ప్రధాన పాత్రలలో నటించిన వసుధార, రిషి పాత్రలతో పాటు రిషి తల్లిగా నటించిన జగతి మేడం పాత్ర కూడా బయట బాగా ఫేమస్ అయ్యింది. జగతి మేడం పాత్రలో ఈ సీరియల్ లో జ్యోతి రాయి నటించింది.
View this post on Instagram
గుప్పెడంత మనసు సీరియల్ లో జ్యోతి రాయి సాంప్రదాయ చీర కట్టుతో తన సహజమైన నటనతో బుల్లికర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. జ్యోతి మేడం పాత్రలో జ్యోతి రాయి తెలుగు రాష్ట్రాలలో బాగా పాపులర్. ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె సినిమాలలోకి కూడా అడుగు పెట్టింది. కానీ గుప్పెడంత మనసు సీరియల్ లో తల్లి పాత్రలో చాలా పద్ధతిగా కనిపించిన జ్యోతి రాయి సోషల్ మీడియాలో మాత్రం అందరూ షాక్ అయ్యే లుక్ లో కనిపించింది. నిత్యం తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నేటిజన్స్ను ఆకట్టుకుంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని అందంతో జ్యోతి రాయి తన ఫోటోలతో అందరి మతి పోగొడుతుంది. గ్లామర్ షోకు ఏ మాత్రం తగ్గకుండా కుర్ర హీరోయిన్లకు సైతం ఈ బ్యూటీ టెన్షన్ పెట్టిస్తుంది.
Also Read: హద్దులు దాటిన అభిమానం..పెళ్లి పత్రిక పై మహేష్ బాబు ఫోటో!