https://oktelugu.com/

టీజర్ టాక్: ‘కోబ్రా’తో అదరగొట్టిన విక్రమ్ !

విలక్షణ స్టార్ చియాన్ విక్రమ్ మొత్తానికి తన ”కోబ్రా” టీజర్ తో అదరగొట్టాడు. టీజర్ చూస్తుంటే.. సినిమా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. మేకింగ్ తో పాటు నేపథ్య సంగీతం, నటీనటుల ఆహార్యం, దర్శకుడి ఎన్నుకున్న కాన్సెప్ట్, స్క్రీన్ టోన్ మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షుకులకు నచ్చేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో విక్రమ్ ఓ జీనియస్ మ్యాథమెటిషియన్ గా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా విక్రమ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇక ప్రతీ […]

Written By:
  • admin
  • , Updated On : January 9, 2021 / 03:25 PM IST
    Follow us on


    విలక్షణ స్టార్ చియాన్ విక్రమ్ మొత్తానికి తన ”కోబ్రా” టీజర్ తో అదరగొట్టాడు. టీజర్ చూస్తుంటే.. సినిమా ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ లా అనిపిస్తోంది. మేకింగ్ తో పాటు నేపథ్య సంగీతం, నటీనటుల ఆహార్యం, దర్శకుడి ఎన్నుకున్న కాన్సెప్ట్, స్క్రీన్ టోన్ మొత్తానికి అన్ని వర్గాల ప్రేక్షుకులకు నచ్చేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో విక్రమ్ ఓ జీనియస్ మ్యాథమెటిషియన్ గా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా విక్రమ్ లుక్ అద్భుతంగా ఉంది. ఇక ప్రతీ ప్రాబ్లమ్ కి మ్యాథమాటికల్ సొల్యూషన్ ఉంటుందనే కోణంలో సినిమా ఉండబోతుందట.

    Also Read: ‘అల్లుడు’ రాక మీద అనుమానాలు !

    ఇక ఎప్పటిలాగే విక్రమ్ తన తెలివితో రకరకాల గెటప్స్ మారుస్తూ క్రైమ్స్ చేసేవాడిలా కనిపించబోతున్నాడు. అయితే ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ కనిపించబోతుండటంతో ఈ సినిమా పై బాగా ఆసక్తి క్రియేట్ అయింది. ఇక ఈ టీజర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా చాల బాగుంది. విక్రమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్ – మృణాలిని – కనికా – పద్మప్రియ – బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్ – కేజీఎఫ్-2’ రిలీజ్ డేట్స్ లో ఒప్పందం !

    మొత్తం మీద ‘కోబ్రా’ టీజర్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమై.. కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు సరికొత్త కాన్సెప్ట్ తో వస్తోంది. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. విక్రమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్