Mr Bachchan: ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా నిర్మాతకు భారీ లాభం..అది ఎలా సాధ్యం అంటే!

హరీష్ శంకర్ బలవంతంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి, హీరోయిన్ అందచందాలను కవర్ చేస్తూ సినిమాని తీసాడు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో సినిమా మీద మంచి అంచనాలను రేపడం లో సక్సెస్ అయ్యాడు కానీ, స్క్రీన్ ప్లే ని నడిపించే విధానం లో విఫలం అయ్యాడు. అంతే కాకుండా ప్రీమియర్ షోస్ వేయించి పెద్ద తప్పు చేసాడు.

Written By: Vicky, Updated On : September 8, 2024 6:08 am

Mr Bachcha

Follow us on

Mr Bachchan: మిరపకాయ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి రవితేజ తో చేసిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరో గా నటించిన ‘రైడ్’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలిపెందుకు ఏమాత్రం స్కోప్ లేదు. కానీ హరీష్ శంకర్ బలవంతంగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి, హీరోయిన్ అందచందాలను కవర్ చేస్తూ సినిమాని తీసాడు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ తో సినిమా మీద మంచి అంచనాలను రేపడం లో సక్సెస్ అయ్యాడు కానీ, స్క్రీన్ ప్లే ని నడిపించే విధానం లో విఫలం అయ్యాడు. అంతే కాకుండా ప్రీమియర్ షోస్ వేయించి పెద్ద తప్పు చేసాడు. నిర్మాత వద్దు అంటూ పదే పదే వారించినా కూడా లెక్క చేయకుండా ఈ సినిమాకి విడుదల ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ వేశారు.

అక్కడి నుండి డిజాస్టర్ టాక్ రావడంతో రెగ్యులర్ షోస్ పై తీవ్రమైన ప్రభావం పడింది. దీంతో టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన ఈ సినిమా, కేవలం నాలుగు కోట్ల రూపాయిల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లాంగ్ రన్ లో అదనంగా మరో రెండు కోట్ల రూపాయిలను మాత్రమే రాబట్టిన ఈ సినిమా, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయిల షేర్ వద్ద థియేట్రికల్ రన్ ముగించుకుంది. బిజినెస్ దాదాపుగా 35 కోట్ల రూపాయిలు జరిగింది. దీంతో నష్టపరిహారంగా రవితేజ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ నుండి నాలుగు కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చేయగా, హరీష్ శంకర్ రెండు కోట్ల రూపాయిలను తిరిగి ఇచ్చేసాడు. దీంతో పాటు నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం చేసుకున్న తేదీ కంటే ముందే విడుదల చేసుకునే అవకాశం ఇస్తే అదనంగా మరో 5 కోట్ల రూపాయిలు ఇస్తామని చెప్పారు. దీనికి నిర్మాత ఒప్పుకున్నాడు. మొత్తం మీద నిర్మాతకు నెట్ ఫ్లిక్స్ సంస్థ నుండి 25 కోట్ల రూపాయిలు వచ్చాయి.

ఆడియో పెద్ద హిట్ అయ్యింది కాబట్టి ఆడియో రైట్స్ 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా, హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్ల రూపాయలకు, సాటిలైట్ రైట్స్ 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. మొత్తం మీద థియేట్రికల్ రన్ నుండి ఏమి రాకపోయినా రవితేజ మరియు హరీష్ శంకర్ కలిసి ఇచ్చిన 6 కోట్ల రూపాయలతో కలిపి మిగతా రైట్స్ మొత్తం కలిపి 61 కోట్ల రూపాయిలు లాభాలు వచ్చాయి. నిర్మాత సేఫ్ అయ్యాడు, కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్స్ పరిస్థితి ఏమిటి?, నిర్మాత విశ్వప్రసాద్ వాళ్లకు నష్టపరిహారం చెల్లిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదే బ్యానర్ నుండి ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది.