https://oktelugu.com/

Rajinikanth – Surya : తంగలాన్ తో విక్రమ్ హిట్టు కొట్టాడు… మరి రజినీకాంత్, సూర్య ల పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ మన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రతి సినిమా కూడా ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతుండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 / 05:13 PM IST

    Rajinikanth and Suriya

    Follow us on

    Rajinikanth – Surya : సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సక్సెస్ ఉంటేనే ఇక్కడ వాల్యూ అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సినిమా హీరోలు వరుసగా సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతోనే ముందుకు సాగుతూ ఉంటారు. హీరోల మధ్య సినిమాలపరంగా పోటీ ఉన్నప్పటికీ స్టార్ హీరోలందరు పర్సనల్ జీవితాల్లో మాత్రం వాళ్ళంతా ఒకటిగానే ఉంటారు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వైవిధ్యమైన కథంశాలతో తెరకెక్కుతూ ఉంటాయి. ముఖ్యంగా విక్రమ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ అయితే ఉంటుంది. అలాంటివి లేకపోతే ఆయన అసలు సినిమానే చేయడు. ఇక రీసెంట్ గా తంగలాను సినిమాతో పాన్ ఇండియా రిలీజ్ సొంతం చేసుకున్న ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాతో వచ్చి బొక్క బోర్ల పడ్డాడు. ఇక దాంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో పెద్దగా సత్తా చాటులేదని అనుకుంటున్నా సమయంలో విక్రమ్ తంగలాన్ సినిమాతో వచ్చి భారీ సక్సెస్ సాధించి అందరి అటెన్షన్ ని తన వైపు తిప్పుకున్నాడు.

    మరి మొత్తానికైతే ఇప్పుడు విక్రమ్ సాధించిన విజయాల బాటలోనే రజినీకాంత్, సూర్య నడుస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈనెల 10వ తేదీన రజనీకాంత్ వేట్టయన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.

    ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే రజనీకాంత్ మార్కెట్ మరింత పెరుగుతుంది లేకపోతే మాత్రం కొద్దిగా మార్కెట్ డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీపావళి కానుకగా సూర్య తన కంగువ సినిమాతో వస్తున్నాడు. మరి ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ సాధిస్తే సూర్యకి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.

    లేకపోతే మాత్రం తను ఎప్పటినుంచో కలగంటున్న పాన్ ఇండియా మార్కెట్ అనేది అతనికి అందని ద్రాక్ష గానే మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి విక్రమ్ బాటలో వీళ్ళు సక్సెస్ లను సాధిస్తారా లేదా కమల్ హాసన్ బాటలో ఫ్లాప్ లను మూట గట్టుకుంటారా అనేది తెలియాల్సి ఉంది…