CM Chandrababu: చిత్తూరు జిల్లాలో కుటుంబ రాజకీయాలు అధికం. ఒకప్పుడు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడిన నల్లారి-నారా కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది.నల్లారి కుటుంబానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో పొత్తులో భాగంగా రాజంపేట సీటును బిజెపికి కేటాయించారు. ఆ స్థానం నుంచి పోటీ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ తరుపున స్వయంగా రంగంలోకి దిగారు చంద్రబాబు. ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు. కానీ గట్టి పోటీ ఇచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. అయితే ఆయన పొలిటికల్ లైఫ్ ను సెట్ చేసే బాధ్యతను తీసుకున్నారు చంద్రబాబు.తాజాగా చంద్రబాబును కలిశారు కిరణ్ కుమార్ రెడ్డి.సరిగ్గా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్ ఖరారు కాగా.. కిరణ్ వెళ్లి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గంట పాటు ఆయనతో కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాయలసీమలో వైసీపీ ఎదగకుండా చేసే బాధ్యతను చంద్రబాబు కిరణ్ కు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. అదే సమయంలో కిరణ్ రాజకీయ భవితను తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే కిరణ్ కోసం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఎంపీ ని చేసి తరువాత కేంద్రమంత్రి పదవి దక్కేలా చంద్రబాబు ప్లాన్ వేసినట్లు సమాచారం.
* రాజ్యసభ ఛాన్స్
ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కానుంది. వచ్చే నెలలో రాజ్యసభ స్థానాలను భర్తీ చేయనున్నారు.వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, కృష్ణయ్యలు రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మూడింటికి ఖాళీ కావడంతో నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే టిడిపి నుంచి గల్లా జయదేవ్, జనసేన నుంచి నాగబాబు పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే కృష్ణయ్య బిజెపి వైపు వెళ్ళనుండడంతోఆ రాజ్యసభ సీటు బిజెపికి విడిచి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.ఇక్కడే చంద్రబాబు మాస్టర్ బ్రెయిన్ వాడినట్లు సమాచారం.
* ఎంపీ,తరువాత మంత్రి
ఒకవేళ బిజెపికి ఇవ్వదలుచుకుంటే.. ఆ స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి పెట్టాలని చంద్రబాబు బిజెపి పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబు సిఫారసు చేసినట్లు సమాచారం. తద్వారా రాయలసీమలో జగన్ కు చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితేకిరణ్ విషయంలో చంద్రబాబు పెద్ద ప్లాన్ తోనే ఉన్నారు.కానీ అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.