https://oktelugu.com/

Vikram : రాజమౌళి మహేష్ బాబు సినిమా మీద క్లారిటీ ఇచ్చిన విక్రమ్…ఇంతకీ తను ఏం చెప్పడంటే..?

తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఏ లాంగ్వేజ్ సినిమానైనా సరే ఆదరిస్తారు అనేది ఇప్పటి చాలాసార్లు ప్రూవ్ అయింది..ఇక ఈ ఆగస్టు 15 కి చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 5, 2024 / 03:52 PM IST
    Follow us on

    Vikram : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు చేసి మంచి విజయాలను అందుకొని సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రమ్… ప్రస్తుతం ఈయన ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తనను తాను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేసుకుంటున్నాడు… ఇక ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ ని నిర్వహించారు. ఇక అందులో విక్రమ్ మాట్లాడుతూ పలు రకాల ఆసక్తికరమైన కామెంట్లైతే చేశాడు. ఇక అందులో భాగంగానే ఆయన పా.రంజిత్ డైరెక్షన్ లో ఎప్పటినుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఎందుకు అంటే రంజిత్ సినిమాల్లో సమాజం, మానవత్వం, మనుషుల గురించి చాలా డెప్త్ కంటెంట్ ఉంటుందని అలాంటి క్యారెక్టర్ లో నటించడం అంటే ఆయనకి చాలా ఇష్టం అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ఇక మొదటిసారిగా రంజిత్ ఈ కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో కూడా తను ఊహించుకొని దానికి సంబంధించిన గెటప్ లోకి మారిపోవడానికి ఆయన చాలావరకు కష్టపడ్డారట. ఇక మొత్తానికైతే ఆయన కష్టానికి ఆగస్టు 15వ తేదీన ప్రతిఫలం దక్కబోతుంది అనేది మనకు చాలా క్లియర్ గా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే పాన్ వరల్డ్ గా తెరకెక్కుతున్న రాజమౌళి మహేష్ బాబు సినిమాలో విక్రమ్ నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి చాలా రకాల వార్తలైతే వస్తున్నాయి.

    అయినప్పటికీ అందులో ఏమాత్రం నిజం ఉంది అనేది ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఇక ఈ విషయం మీద కూడా విక్రమ్ మాట్లాడుతూ రాజమౌళి తనకు చాలా మంచి మిత్రుడని చెబుతూనే మా కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాం కానీ అది ఏ సినిమా అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు… ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తేదీన థియేటర్ లోకి వస్తున్న తనను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇక స్వతహాగా తెలుగులో తనకు మంచి గుర్తింపు ఉందని అలాగే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే కూడా తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ గా మారిందని తనకు కూడా ఇక్కడ స్ట్రైయిట్ గా తెలుగు సినిమాలు చేయాలనే ఆలోచన ఉందని తొందర్లోనే తెలుగు సినిమా చేస్తానంటూ ఆయన తెలుగు ప్రేక్షకులకు మాట కూడా ఇచ్చాడు…ఇక ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కూడా తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశాడు. దాదాపు పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలపాటు శ్రమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నాడు.

    తద్వారా తను అనుకున్న గోల్ ను రీచ్ అవ్వడమే కాకుండా డిప్యూటీ సీఎం గా కూడా తన పదవి బాధ్యతలను చాలా సిన్సియర్ గా కొనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన చెప్పిన మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులను కూడా సంతోషపడేలా చేస్తున్నాయి… ఇక మొత్తానికైతే విక్రమ్ తంగలాన్ సినిమాతో ఆగస్టు 15వ తేదీన ఒక భారీ సక్సెస్ ని కొట్టడానికి మన ముందుకు వస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో తను సక్సెస్ కొట్టినట్లైతే ఆయన మార్కెట్ అనేది భారీగా విస్తరిస్తుందనే చెప్పాలి…