Ram Gopal Varma : ఒక సినిమాతో నాగార్జునను ఆకాశానికి ఎత్తిన ఆ దర్శకుడే మరో సినిమాతో పాతాళానికి పడేసాడు…ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ల ఎంటైర్ కెరియర్ లో చాలా మంచి క్యారెక్టర్స్ ను పోషిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...

Written By: Gopi, Updated On : August 5, 2024 4:06 pm
Follow us on

Ram Gopal Varma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి గుర్తింపు అయితే ఉంది. అక్కినేని నాగేశ్వరరావు తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి వరుస సినిమాలు చేసి ప్రేక్షకులు చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన తర్వాత నాగార్జున ఇండస్ట్రీకి రావడమే కాకుండా తను కూడా స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకుంటూ వచ్చాడు. మొదట నాగార్జున నటన మీద కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన చేసిన సినిమాల ద్వారా ఆయన మంచి సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఒక మంచి నటుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు.. అలాగే చాలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఇక శివ సినిమాతో తనకు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందించిన రామ్ గోపాల్ వర్మ తో ఆయనకు చాలా మంచి సంబంధమైతే ఉంది. ఇక ఇప్పటివరకు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూనే ఉన్నారు. ఇక వర్మ ఎవరి గురించైనా సరే చాలా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు.

ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎమోషన్స్ కి చాలా దూరంగా ఉంటాడు. అయినప్పటికీ ఒక ఈవెంట్ లో నాగార్జున ఎదురుగా ఉన్నప్పుడే ఆర్జీవీ ఆయన మీద కొన్ని సంచలన కామెంట్లు చేశాడు…నాకు నాగార్జున లాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ పరిచయం అవ్వడం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటు ఆయన చెప్పడం ఇక ఆ సమయం లో ఆ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఆ సీన్ కళ్ళలో నీళ్ళు తెప్పించిందనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే వీళ్ళ కాంబినేషన్ లో అప్పట్లో రెండు మూడు సినిమాలు వచ్చాయి.

అయినప్పటికీ ఆ తర్వాత వర్మ సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో నాగార్జున ఆయనతో సినిమాలు చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు. ఇక ఎట్టకేలకు మరోసారి వీళ్ళిద్దరూ కలిసి ‘ఆఫీసర్ ‘ అనే సినిమా చేశారు. ఈ సినిమాతోనే నాగార్జునకు భారీ డామేజ్ జరిగిందనే చెప్పాలి. తన పాటికి తను ఊపిరి, సోగ్గాడే చిన్నినాయన లాంటి మంచి కమర్షియల్ సినిమాలను చేసుకుంటూ ముందుకు వెళుతున్న క్రమంలో ఆఫీసర్ అంటూ ఒక సినిమా చేయడం అది దారుణంగా డిజాస్టర్ అవ్వడంతో నాగార్జున కెరియర్ అనేది డైలమాలో పడింది. ఒకప్పుడు శివ సినిమాతో తన కెరీర్ ని ఆదుకున్న వర్మ ఇప్పుడు ఆఫీసర్ సినిమాతో తన కెరీర్ ని భారీగా దెబ్బ కొట్టాడనే చెప్పాలి…

ఇక అప్పటినుంచి నాగార్జునకి ఒక్క సినిమా కూడా సరైన సక్సెస్ అవ్వడం లేదు. మరి ఇలాంటి సందర్భంలో ‘ కుబేర ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అతనిది ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాదు కానీ సినిమాకి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనే విషయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు… మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన వందో సినిమాకి సంబంధించిన కథలను కూడా వింటున్నాడు. అయితే కొంతమంది చెప్పిన స్టోరీలు తనకు బాగా నచ్చినప్పటికీ వాటిలో ఏ సినిమాని తన వందో సినిమాగా ఎంచుకోవాలి అనే దాని మీదనే ఇప్పుడు ఆయన ఒక డైలమా లో ఉన్నట్టుగా తెలుస్తుంది…