https://oktelugu.com/

Leo Collection: విజయ్ కి షాక్… రెండో వారం బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ లియో!

ఇండియాలో ఫస్ట్ వీక్ లియో వసూళ్లు పరిశీలిస్తే... తమిళంలో రూ. 215, తెలుగులో రూ. 35 కోట్లు, హిందీలో రూ. 17 కోట్లు, కర్ణాటకలో రూ. 33 కోట్లు, కేరళలో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : October 28, 2023 / 12:35 PM IST

    Leo Collection

    Follow us on

    Leo Collection: విజయ్ కెరీర్ లో భారీ అంచనాల మధ్య విడుదలైంది లియో. లోకేష్ కనకరాజ్ దర్శకుడు కావడం, ప్రోమోలు ఆకట్టుకోవడంతో హైప్ ఆకాశానికి చేరింది. అదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ రూ.210 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో లియో హక్కులు రూ. 16 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అది వసూళ్ల మీద ప్రభావం చూపించింది. అయితే దారుణంగా వసూళ్లు పడిపోలేదు.

    ఇండియాలో ఫస్ట్ వీక్ లియో వసూళ్లు పరిశీలిస్తే… తమిళంలో రూ. 215, తెలుగులో రూ. 35 కోట్లు, హిందీలో రూ. 17 కోట్లు, కర్ణాటకలో రూ. 33 కోట్లు, కేరళలో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సుమారు ఇండియాలో రూ. 270 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు వినికిడి. తెలుగులో లియో క్లీన్ హిట్ గా నిలిచింది. రూ. 20 కోట్లకు పైగా షేర్ రాబట్టి లాభాలు పంచింది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు.

    ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం సత్తా చాటింది. యూఎస్ లో $5 మిలియన్ మార్క్ దాటేసింది. దాదాపు 34 దేశాల్లో లియో విడుదల చేశారు. లియో వరల్డ్ వైడ్ రూ. 175 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ లియో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే రెండో వారం లియో వసూళ్లు పూర్తిగా నెమ్మదించాయి. ఇండియాలో 8వ రోజు రూ. 9 కోట్లు, 9వ రోజు రూ. 7.5 కోట్ల వసూళ్లు రాబట్టిందట.

    బాక్సాఫీస్ వద్ద లియో జోరు తగ్గింది. అయితే చాలా ఏరియాల్లో మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యింది. లియో మూవీ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కింది. త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ కీలక రోల్స్ చేశారు. అనిరుధ్ సంగీతం అందించారు. అది సినిమాకు ప్లస్ అయ్యింది.