Odi World Cup 2023: ఈనెల 29వ తేదీన ఇండియా ఇంగ్లాండ్ తో ఒక భారీ మ్యాచ్ ఆడనుంది.ఇక అందులో భాగంగానే ఇండియా ప్లేయింగ్ 11 లో భారీ మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ని రోజులు ఇండియన్ టీం కి ఆల్ రౌండర్ గా సేవలు అందించిన హార్థిక్ పాండ్యా గాయం కారణంగా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన ప్లేస్ లో గత మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ని తీసుకోవడం జరిగింది.అయితే సూర్య అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదు. మరి ఈ మ్యాచ్ లో ఆయనని కంటిన్యూ చేస్తారా అనే విషయం మీద క్లారిటీ రావడం లేదు.ఎందుకంటే ప్రతిసారి తనని తాను ప్రూవ్ చేసుకోవడంలో సూర్య ఫెయిల్ అయిపోతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో ఆయనకు ఇంకొక ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని అనే చెప్పాలి. ఇక న్యూజిలాండ్ మ్యాచ్ లో మూడోవ పేసర్ గా షమీ టీమ్ లోకి రావడం జరిగింది. న్యూజిలాండ్ మ్యాచ్ లో హార్థిక్ పాండ్య టీమ్ లో లేకపోవడం వల్ల గత మ్యాచ్ లో రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. హార్థిక్ పాండ్యా ప్లేస్ లో సూర్య కుమార్ యాదవ్ వస్తే శార్దూల్ ఠాకూర్ ప్లేసు లోకి షమీ రావడం జరిగింది. అది హార్థిక్ పాండ్యా ఉంటే ఇటు బౌలింగ్ లోనూ,ఇటు బ్యాటింగ్ లోను తనదైన సత్తా చాటుతూ చావు మంచి పర్ఫామెన్స్ ఇచ్చేవాడు. ఆయన లేకపోవడం వల్ల ఒక బ్యాట్స్ మెన్స్ ని ఒక బౌలర్ ని అదనంగా తీసుకోవడం జరుగుతుంది.ఇక ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లక్నోలో ఆడుతున్నారు కాబట్టి అది ఎక్కువగా స్పిన్ కి అనుకులించే పిచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ లోకి రవిచంద్ర అశ్విన్ ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే రవిచంద్రన్ అశ్విన్ టీమ్ లోకి వస్తె పేసర్లలో ఎవరినో ఒకరిని బెంచ్ కి పరిమితం చేయాల్సి వస్తుంది.మరి ఇలాంటి టైం లో బుమ్ర, సిరజ్ లలో ఎవరినో ఒకరిని పక్కన పెడుతారా లేదా షమీ ని పక్కన పెడుతర అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ క్రమంలో మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది ఏంటి అంటే ఆల్ రౌండర్ గా రవిచంద్రన్ అశ్విన్ ని తీసుకొని సూర్య కుమార్ యాదవ్ ని పక్కన కూర్చోబెడితే బాగుంటందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇలా అయితే బ్యాటింగ్ లో టీమ్ చాలా వీక్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు…
ఇక ఇలాంటి క్రమం లో ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కి ఇప్పుడు ప్లేయింగ్ 11 లో ఎవరిని తీసుకోవాలో అర్థం కావడం లేదు…అందుకే చివరి నిమిషం వరకు ఇండియన్ టీమ్ లో ఎవరు ఉంటారు అనే విషయం మీద క్లారిటీ లేదు…