Chiranjeevi Bobby Movie: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బాబీ తో చేయబోయే సినిమాకు సర్వం సిద్ధంగా ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 25 న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది. కానీ అన్నీ అనుకున్నట్లుగా అసలు జరగడం లేదు. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఇదే సంస్థ పై తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(Jana Nayagan Movie) చిత్రం తెరకెక్కింది. ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడంతో విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తుంది. కోర్టు నుండి ఈ సినిమాకు అనుకూలంగా తీర్పు ఎప్పుడు వస్తుందో, ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ అర్థం అవ్వని పరిస్థితి.
ఇలాంటి సమయం లో ఈ చిత్ర నిర్మాతకు ‘జన నాయగన్ ‘ ద్వారా అందాల్సిన అడ్వాన్స్ లు అందలేదు. ఫైనాన్షియర్స్ కి కూడా డబ్బులు ఇప్పటి వరకు చెల్లించలేదు. వాళ్ళ వైపు నుండి ఈ చిత్ర నిర్మాతకు ప్రతీ రోజు ఒత్తిడి పెరిగిపోతూ ఉంది. ఇక ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసిన కొన్ని ప్రాంతాలకు చెందిన బయ్యర్స్ మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి , ఈ సినిమా ఇప్పట్లో విడుదల అవుతుందనే నమ్మకం లేదని అంటున్నారట. దీంతో ఆ చిత్ర నిర్మాత ఇప్పుడు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లోకి వెళ్ళిపోయాడు. దీంతో ఈ నెల 25 న సెట్స్ మీదకు వెళ్లాల్సిన చిరంజీవి, బాబీ చిత్రం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు . ‘జన నాయగన్’ చిత్రం విడుదల అయితే డబ్బుల రొటేషన్ జరుగుతుంది. చిరంజీవి సినిమాకు పెట్టాల్సిన బడ్జెట్ ని కూడా పెట్టగలడు.
అప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశమే లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఒకవేళ KVN ప్రొడక్షన్స్ తో పాటు మరో నిర్మాణ సంస్థ కూడా నిర్మాణం లో భాగం పంచుకుంటే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చు. రీసెంట్ గా చిరంజీవి కుమార్తె ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలను మూటగట్టుకుంది. ఆమె ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తే ఈ చిత్రం ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. గతం లో చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ అనే చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.