IND Vs NZ: టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ హస్తవాసి బాగున్నట్టు కనిపిస్తోంది. 2024 లో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ పోటీ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నుంచి టీమిండియాను పొట్టి ఫార్మాట్లో సూర్య కుమార్ యాదవ్ ముందుండి నడిపిస్తున్నాడు. 2024 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు టీమిండియా ఒక్క టి20 సిరీస్ కూడా కోల్పోలేదు. ఆస్ట్రేలియా నుంచి మొదలుపెడితే దక్షిణాఫ్రికా వరకు ప్రతి జట్టు మీద టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. అంతేకాదు ట్రోఫీలను కూడా అందుకుంది.
టీం ఇండియాకు సారథి అయిన తర్వాత సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా లేకపోయినప్పటికీ.. నాయకుడిగా మాత్రం అతడు జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడు. అందువల్లే 2024 నుంచి టీమిండియా పొట్టి ఫార్మేట్ లో ఒక్క సిరీస్ కూడా ప్రత్యర్థులకు అప్పగించలేదు. పైగా స్వదేశం, విదేశాలలోనూ డామినేషన్ కనబరుస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొడుతోంది. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. స్పష్టమైన లీడ్ కొనసాగిస్తోంది.
టీమిండియా ఈ స్థాయిలో విజయాలు సాధించినప్పటికీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన అంత గొప్పగా లేకపోవడం అభిమానులకు ఇబ్బంది కలిగిస్తోంది. అయితే ఒక విషయంలో మాత్రం సూర్య కుమార్ యాదవ్ నక్క తోక తొక్కాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్లు (వన్డే, టెస్ట్ ఫార్మాట్) టాస్ అంతగా గెలవలేక పోతున్నారు. కానీ, సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టి20 సిరీస్ లో టాస్ విషయంలో భిన్నత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. తొలి టి20 మ్యాచ్లో టాస్ ఓడిపోయిన సూర్య కుమార్ యాదవ్.. కాస్త ఇబ్బంది పడ్డాడు. మైదానం గురించి సరిగా అంచనా వేయలేక న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ముసి ముసి నవ్వులు నవ్వాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో టీమిండియా ఏ స్థాయిలో ప్రతాపం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే టాస్ గెలిచి ఉంటే కచ్చితంగా సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ ఎంచుకునే వాడట. మైదానం మీద డ్యూ రాకపోయినప్పటికీ.. బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉండడంతో.. తాను ఆ నిర్ణయం తీసుకునే వాడినని చెప్పాడు. ఇక రెండవ టి20 మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ నక్క తోక తొక్కాడు. రాయ్ పూర్ వేదికగా జరుగుతున్న రెండో టి20 లో టాస్ గెలిచాడు. ఇక్కడి మైదానం పరిస్థితిని ముందుగానే అంచనా వేసి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒకవేళ ఈ మైదానంలో డ్యూ ఎఫెక్ట్ అంతగా లేకపోతే భారత బౌలర్లు పండగ చేసుకుంటారు.
ఇక రెండో టి20 మ్యాచ్లో టీమిండియా కొన్ని మార్పులతో మైదానంలోకి దిగింది. అక్షర్ పటేల్, బుమ్రా కు విశ్రాంతి ఇచ్చింది. అక్షర్ పటేల్ తొలి టి20 మ్యాచ్లో గాయపడ్డాడు. దీంతో టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని అతడికి మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చింది. బుమ్రా మీద వర్క్ లోడ్ పడకుండా ఉండడానికి.. మేనేజ్మెంట్ అతనికి కూడా విశ్రాంతి ఇచ్చింది. అక్షర్ స్థానంలో కులదీప్.. బూమ్రా స్థానంలో హర్షిత్ రాణా కు అవకాశం కల్పించింది.