https://oktelugu.com/

విజయ్ బిజినెస్ స్పీడ్ ఏ హీరోకి లేకపాయే !

  టాలెంట్ ఉన్నోడికి సపోర్ట్ అక్కర్లేదని ఈ జనరేషన్ లో నిరూపించిన హీరో విజయ్‌ దేవరకొండే. తన మొదటి సినిమాలో గుంపులో ఒకడిగా నటించాడు. అలాంటి వ్యక్తి అతి తక్కువ టైంలోనే సౌత్ క్రేజీ హీరోగా మారతాడంటే.. నమ్మశక్యం కానీ విషయం. అయితే విజయ్ సక్సెస్ అయ్యాడు. పైగా హీరోగా నటిస్తూనే అటు బిజినెస్ మేన్ గానూ రాణిస్తున్నాడు. హీరోల్లో నాగార్జున మంచి బిజినెస్ మెన్ అని పేరు ఉంది. నిజానికి నాగార్జున కూడా విజయ్ ముందు […]

Written By:
  • admin
  • , Updated On : July 23, 2020 / 07:51 PM IST
    Follow us on

     

    టాలెంట్ ఉన్నోడికి సపోర్ట్ అక్కర్లేదని ఈ జనరేషన్ లో నిరూపించిన హీరో విజయ్‌ దేవరకొండే. తన మొదటి సినిమాలో గుంపులో ఒకడిగా నటించాడు. అలాంటి వ్యక్తి అతి తక్కువ టైంలోనే సౌత్ క్రేజీ హీరోగా మారతాడంటే.. నమ్మశక్యం కానీ విషయం. అయితే విజయ్ సక్సెస్ అయ్యాడు. పైగా హీరోగా నటిస్తూనే అటు బిజినెస్ మేన్ గానూ రాణిస్తున్నాడు. హీరోల్లో నాగార్జున మంచి బిజినెస్ మెన్ అని పేరు ఉంది. నిజానికి నాగార్జున కూడా విజయ్ ముందు తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే విజయ్ బిజినెస్ కి పెట్టుబడి విజయ్ దే. దానికి తోడు ఐడియా దగ్గర నుండి దాన్ని ముందుకు తీసుకుపోయే ప్లానింగ్ వరకూ అంతా విజయ్ దే. అయినప్పటికీ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తన బిజినెస్ ను చాల కూల్ గా హ్యాండిల్ చేస్తూ.. తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ను జనంలోకి బాగానే తీసుకువెళ్లగలిగాడు.

    Also Read: సూర్య ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌..

    ఇప్పుడు కొన్ని కొత్త బిజినెస్ లకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ లాక్ డౌన్ లో వచ్చిన ఖాళీ సమయాన్ని తన కొత్త బిజినెస్ ల పనులకు వాడుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా నిర్మాణం మొదలుపెట్టిన విజయ్, కరోనా అనంతరం టీవీ నిర్మాణంలోకి కూడా ప్రవేశించబోతున్నాడు. అలాగే ఓ స్టోర్ ను పెట్టాలని చూస్తున్నాడు. ఏమైనా విజయ్ దేవరకొండ ఊపు చూస్తుంటే.. టాలీవుడ్ లో తన ముద్ర బలంగానే వేసేలా కనిపిస్తున్నాడు. మొత్తానికి తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన క్రేజ్ ను తెచ్చుకున్న విజయ్ దేవరకొండ స్పీడ్ ప్రస్తుతం మరే హీరోకి లేదనే చెప్పాలి.

    Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!

    అవును, ఫ్యాషన్ ప్రపంచానికే రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారడం అంటే… ఆ క్రెడిట్ విజయ్ కే దక్కుతుంది. అయినా, సెలబ్రిటీగా తన ఇమేజ్ తో నడిపిస్తున్న తొలి బ్రాండ్.. రౌడీ బ్రాండ్ ఫుట్ వేరే. ఏమైనా తన స్టైయిల్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన ఘనత కూడా విజయ్ కే దక్కుతుంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి దర్శకత్వంలో రానున్న పాన్ ఇండియా మూవీ ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయితే.. విజయ్ రేంజ్ మరింతగా పెరిగిపోతుంది.