https://oktelugu.com/

బాలయ్యకు ఇప్పుడు ఒక హీరో కావాలి..!

బాలయ్య బాబు సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతారు.. ఇది ఆనవాయితీగా వస్తోన్న బాలయ్య సినిమాల వ్యవహారశైలి కూడా. కానీ, బాలయ్యకు ఇప్పుడు ఒక హీరో కావాలి. తన అసిస్టెంట్ పాత్రకి. ముందుగా నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నా.. ఇంకా బెటర్ అప్షన్ అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. జస్ట్ గెస్ట్ రోల్ లాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ అసిస్టెంట్ రోల్ కాస్త మొదట ఫన్నీగా సాగిన చివర్లో ఎమోషనల్ గా ముగుస్తుందట. పైగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 08:32 PM IST
    Follow us on

    బాలయ్య బాబు సినిమాలో బాలయ్య ఒక్కరే హైలైట్ అవుతారు.. ఇది ఆనవాయితీగా వస్తోన్న బాలయ్య సినిమాల వ్యవహారశైలి కూడా. కానీ, బాలయ్యకు ఇప్పుడు ఒక హీరో కావాలి. తన అసిస్టెంట్ పాత్రకి. ముందుగా నవీన్ పొలిశెట్టిని తీసుకుందామనుకున్నా.. ఇంకా బెటర్ అప్షన్ అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. జస్ట్ గెస్ట్ రోల్ లాగా ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఆ అసిస్టెంట్ రోల్ కాస్త మొదట ఫన్నీగా సాగిన చివర్లో ఎమోషనల్ గా ముగుస్తుందట. పైగా ఆ పాత్ర చుట్టే సినిమా సాగుతుంది.. బాలయ్య పాత్ర తాలూకు యాక్టివిటీస్ అన్ని ఆ పాత్ర కోసమే ఆధారపడి ఉంటాయట. అందుకే కొంచెం ఫామ్ లో ఉన్న హీరో అయితేనే సినిమా నిలబడుతుంది. మరి ఫామ్ లో ఉన్న ఎవరేజ్ హీరోలు అంటే.. నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్, శర్వానంద్ లాంటి హీరోలు ఉన్నారు. మరి వీరిలో బాలయ్య సినిమాలో అసిస్టెంట్ పాత్ర చేయడానికి ఎవరు ముందుకు వస్తారన్నదే ఇప్పుడు మరో ప్రశ్న.

    Also Read: జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !

    మాస్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకు ఉన్న బ్రాండ్ కోసమైనా ఎవరో ఒకరు ఒప్పుకుంటారనే హోప్ ఉంది నిర్మాతలకు. కానీ నాని, లేదా శర్వానంద్ అయితే బాగుంటుందని బోయపాటి ఫీల్ అవుతున్నారు. నాని చెయ్యను అంటే, శర్వానంద్ దగ్గరకు వెళ్తుంది. శర్వా కూడా నో అంటే.. నిఖిల్ ను ఫిక్స్ చేస్తారట. నిఖిల్ చేయడానికి ఆసక్తి చూపొచ్చు. ఎంతలేదన్నా బాలయ్య ఒకప్పటి టాప్ స్టార్ హీరో. అలాంటి హీరో సినిమాలో సెకెండ్ లీడ్ చేయడానికి వెనుకడుగు వేయక్కర్లేదు. కానీ నాని మాత్రం, బాలయ్య సినిమాలో చేయడానికి ఇంట్రస్ట్ గా లేడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి శర్వానంద్ అన్నా ఒప్పుకుంటాడేమో చూడాలి.

    Also Read: వెబ్‌ బాటలో సుక్కూ.. మరి ‘పుష్ప’ పరిస్థితేంటి?

    ఇక ఈ సినిమా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ దుమ్ము రేపే యాక్షన్ తో అభిమానులను బాగానే ఆకట్టుకున్నా.. ఎప్పటిలాగే అదే కొట్టుడు… అవే డైలాగ్ లు లాగా అనిపించాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే ఓ మలయాళీ భామను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు. ఆమె ఇంతకు ముందు మలయాళీ సీరియల్ లో నటించిందట. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా.. మ్యూజిక్ సెన్సేషనల్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్లాప్ లతో బాధ పడుతున్న బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి, ఆ తర్వాత ‘లెజెండ్’తో మరో భారీ విజయాన్ని కూడా అందించాడు. మరి ఈ సారి కూడా ప్లాప్ ల్లో ఉన్న బాలయ్యకు సూపర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.