Homeఎంటర్టైన్మెంట్Vijayendra Prasad: ఆ సినిమా కథ ని వేరే వాళ్ళకి ఇచ్చారని రాజమౌళి ఏడ్చేశారట !...

Vijayendra Prasad: ఆ సినిమా కథ ని వేరే వాళ్ళకి ఇచ్చారని రాజమౌళి ఏడ్చేశారట ! ఏ సినిమా కథ ? హీరో ఎవరు అంటే ..!

Vijayendra Prasad: టాలీవుడ్ లో స్టార్ రైటర్ అయిన విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసే కథలు ఎవ్వరి ఊహకందని విధంగా ఉంటాయి. ఒక్కో పాత్రను అద్భుతంగా మలచగల దిట్ట. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ కథలు రాస్తుంటారనేది మనకు తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఒక సినిమాకు పని చేస్తే వచ్చే ఫలితం మాటల్లో చెప్పలేం.

ఇప్పటికే జక్కన్న తీసిన సినిమాల ఫలితాలు ఆ విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మేనియా చూపిస్తున్న త్రిబుల్ ఆర్ కథను కూడా విజయేంద్రప్రసాద్ అందించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం ఎన్నో విషయాలను పంచుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Also Read: RRR Movie Review: రివ్యూ :  ‘ఆర్ఆర్ఆర్’

తాను భజరంగీ భాయిజాన్ మూవీ కథ రాసినప్పుడు మొదట తెలుగు హీరోతోనే చేయాలనుకున్నానని.. కానీ అది చివరకు బాలీవుడ్ కు చేరిందన్నారు. స్టార్ హీరో అమీర్ ఖాన్ మొదట కథ విని ఎంతో బాగుందని మెచ్చుకున్నాడనీ.. కానీ తాను పాత్రకు కనెక్ట్ కాలేకపోతున్నానని.. రిజెక్ట్ చేశాడని చెప్పారు విజయేంద్రప్రసాద్. ఇదే కథను సల్మాన్ ఖాన్ కు వివరించగా ఆయన వెంటనే ఓకే చెప్పేశాడట.

Vijayendra Prasad
Vijayendra Prasad

తాను సల్మాన్ కు కథ చెప్పిన విషయాన్ని విజయేంద్రప్రసాద్ రాజమౌళికి చెప్పాడట. అయితే అప్పుడు బాహుబలి యుద్ధ సన్నివేశాలతో బిజీగా ఉన్నాడు రాజమౌళి. కావాలంటే నీకోసం కథను ఆపేస్తానని రాజేంద్రప్రసాద్ చెప్పగా.. వద్దు వారికి ఇచ్చేయ్ అంటూ రాజమౌళి చెప్పాడట. కానీ సినిమా విడుదలై సంచలన విజయం సాధించడంతో పాటు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ మూవీ ప్రభంజనం చూసిన రాజమౌళి తన మనసులో మాట చెప్పాడట. రోహిణి కార్తె ఎండల్లో బాహుబలి యుద్ధ సన్నివేశాలు చేస్తున్నానని, అప్పటికి మండిపోయి ఉన్నానని.. అందుకే కథను వద్దని చెప్పినట్టు తెలిపాడు విజయేంద్రప్రసాద్. అదే కథను ఒక 15 రోజుల ముందు చెప్పినట్లు ఉంటే నేనే చేసే వాడినని రాజమౌళి తన మనసులో మాట చెప్పాడట. ఈ విషయాలను విజయేంద్రప్రసాద్ ఇప్పుడు బయట పెట్టారు.

Also Read: Mahesh Babu About RRR: ‘ఆర్ఆర్ఆర్’ రివ్యూ చెప్పిన మహేష్ !

 

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Ram Charan- NTR RRR Movie Review: సినిమా అంటే ఇన్నాళ్లు హాలీవుడ్ పేరే చెప్పుకునేవారు.. కొన్నాళ్లు బాలీవుడ్ సినిమాలను చూపించేవారు. కానీ మన జక్కన్న చెక్కుడుకు ఇప్పుడు తెలుగు సినిమా వైపే అందరూ చూపిస్తున్నారు. ఒక ప్రాంతీయ సినిమాను ఎల్లలు దాటించే ప్రపంచమంతా వివిధ వర్గాల వారిని ఆకట్టుకునేలా తీసిన ఘనత రాజమౌళిదే.. అందుకే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కు అంత ఆదరణ వచ్చింది. అంతలా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన సగటు ప్రేక్షకుడిని ఫిదా చేసింది. సినిమా గురించి సగటు ప్రేక్షకుడు ఏమనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం.. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular