Rajamouli and Mahesh Babu : దర్శక ధీరుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి(Rajamouli)… ప్రతి సినిమా ఒక సంచలానంగా మారుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తన మార్క్ ను చూపిస్తూ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇండియాలో ఉన్న నెంబర్ వన్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ఆయన పాన్ వరల్డ్ సినిమా చేసి అక్కడ కూడా తన మార్క్ ను చూపించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ఇప్పటికే మహేష్ బాబు(Mahesh Babu)తో చేస్తున్న ఈ సినిమా కోసం మొదటి నుంచి చాలా కష్టపడుతూ వస్తున్నాడు. దాదాపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మీద రెండు సంవత్సరాల పాటు కూర్చున్న రాజమౌళి ఎట్టకేలకు రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే విషయాలను ఎక్కడా తెలియజేయకుండా చాలా గోప్యంగా ఉంచుతున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి ఆ లుక్కులో మహేష్ బాబు ఎలా ఉంటాడు హాలీవుడ్ హీరోలను తలదన్నే విధంగా ఉండబోతున్నాడా? తద్వారా ఆయన ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఏదైనా ఉంటే ఈ సినిమా కథ విషయంలో విజయేంద్రప్రసాద్ కి రాజమౌళికి మొదటి నుంచి కొన్ని క్లాశేష్ అయితే వస్తున్నాయంటూ ఇంతకుముందు సోషల్ మీడియాలో కూడా వార్తలైతే వచ్చాయి. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా కథను రాజమౌళి మరోసారి మారుస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఒకసారి కథని లాక్ చేసిన తర్వాత రాజమౌళి ఆ కథ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయడు… మరలాంటి రాజమౌళి ఇప్పుడు మళ్ళీ కొన్ని చేంజెస్ ఎందుకు చేయాల్సి వస్తుంది.
రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథ మీద అంత సాటిస్ఫై అవ్వడం లేదా అందువల్లే కథను ప్రతిసారి చెక్ చేసుకుంటూ వస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటివరకు రాజమౌళి తన స్టార్ డమ్ ను విస్తరించుకుంటూ వచ్చాడు. ఇక లైఫ్ లో ఇప్పటివరకు అతనికి ఒక ఫెయిల్యూర్ కూడా లేకుండా వస్తున్నాడు. కాబట్టి ఇక మీదట కూడా అదే స్టార్ డమ్ ను కంటిన్యూ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…