Homeఎంటర్టైన్మెంట్Puri Jagannadh : అర్జున్ రెడ్డి 45 నిమిషాలు చూసి ఆపేశా.. పూరి జగన్నాథ్ చెప్పిన...

Puri Jagannadh : అర్జున్ రెడ్డి 45 నిమిషాలు చూసి ఆపేశా.. పూరి జగన్నాథ్ చెప్పిన సీక్రెట్స్

Puri Jagannadh : టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు రేసులో వెనుకబడిపోయాడు. హీరోలను స్టార్లను చేసిన ఆయనకు ఇప్పుడు హీరోలు అవకాశం ఇవ్వాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడూ తన ఓపెన్ స్టేట్‌మెంట్స్, బోల్డ్ టాక్ వల్ల వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను 45 నిమిషాలు చూసి ఆపేశానంటూ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

‘అర్జున్ రెడ్డి’ గురించి పూరి గతంలో లైగర్ సినిమా ఈవెంట్ లో మాట్లాడారు.తన భార్య కాస్త పక్క సినిమాలు కూడా చూడాలని తనను తిట్టిందన్నారు. సందీప్ రెడ్డి వంగా అనే కుర్రాడు అర్జున్ రెడ్డి అనే సినిమా చేశాడు. అందులో విజయ్ హీరోగా నటించాడు. ఆ సినిమా ఇప్పటికే నేను నా బిడ్డ మూడు సార్లు చూశాం. ఆ సినిమా చూసి అలాంటి సినిమా తీయాలని తన భార్య తనకు సలహా ఇచ్చినట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు. దీంతో వెంటనే ఆ సినిమాను చూడడం మొదలు పెట్టానన్నారు పూరి. కానీ అర్జున్ రెడ్డి పూర్తిగా చూడలేదు. 45 నిమిషాలు చూసి ఆపేశానన్నారు. 45 నిమిషాల్లో విజయ్ పైనే తన కళ్లు అన్నీ ఉన్నాయన్నారు. ఎప్పటికైనా తనతో సినిమా తీయాలని ఫిక్స్ అయినట్లు తెలిపారు. తన న్యాచురల్ నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు.

ఈ మాట విన్నవారంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అర్జున్ రెడ్డి యూత్ కి కల్ట్ క్లాసిక్, అలాంటి సినిమాను పూర్తి చూడకపోవడమేంటని అభిమానులు ఆశ్చర్యపడ్డారు. ఆ వెంటనే పూరి నేను ఇలాంటి సినిమా తీయలేకపోయానని బాధపడ్డానన్నారు. పూరి జగన్నాథ్ తాను ‘అర్జున్ రెడ్డి’ లాంటి బోల్డ్, ఇంటెన్స్ లవ్ స్టోరీ తీయలేకపోయానన్న బాధలో ఉన్నట్లు చెబుతూ..
“విజయ్ దేవరకొండను నేను ‘లైగర్’ కోసం డైరెక్ట్ చేశా.. కానీ అతను అర్జున్ రెడ్డి సినిమాతో చూపించిన రేంజ్ మామూలుగా లేదు. అలా డేరింగ్‌గా, రియలిస్టిక్‌గా సినిమా తీయాలనే కోరిక నాకుంది. అయితే ‘అర్జున్ రెడ్డి’ వచ్చిన తర్వాత అలాంటి కంటెంట్ ఇంకా రిపీట్ అవ్వదు. ఆ ఎఫెక్ట్ మళ్లీ ఎవ్వరూ క్రియేట్ చేయలేరు..” అన్నారు.

విజయ్ దేవరకొండపై పూరి అభిప్రాయం
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలయికలో ‘లైగర్’ సినిమా వచ్చినా, అది పెద్దగా ఆడలేదు. కానీ పూరి విజయ్ పై ఇప్పటికీ చాలా నమ్మకంగా ఉన్నాడు. “విజయ్ దేవరకొండ కచ్చితంగా ఇంకా పెద్ద స్టార్ అవ్వాల్సిన వ్యక్తి. ‘అర్జున్ రెడ్డి’ టైంలో అతని అటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, నటన చూస్తే.. ఇండస్ట్రీకి చాలా పెద్ద నటుడు వచ్చాడని అర్థమైపోయింది. తను ఇంకా ఎన్ని హిట్లు కొట్టాలి’’ అన్నాడు.

పూరి మరో ‘అర్జున్ రెడ్డి’లాంటి సినిమా చేస్తాడా?
“చక్కటి బోల్డ్ లవ్ స్టోరీ తీయాలని నా మనసులో ఉంది. కానీ ‘అర్జున్ రెడ్డి’ లాంటి మేజిక్ మళ్లీ రిపీట్ చేయడం చాలా కష్టం. కానీ ఎప్పుడో ఒకప్పుడు.. నాకున్న డేరింగ్ అండ్ డాషింగ్ స్టైల్‌లో అర్జున్ రెడ్డి లాంటి ఓ బోల్డ్ లవ్ స్టోరీ చేస్తాను!” అని పూరి చెప్పాడు.

అర్జున్ రెడ్డి తర్వాత పూరి స్టేట్‌మెంట్ హాట్ టాపిక్!
పూరి జగన్నాథ్ ‘అర్జున్ రెడ్డి’ని 45 నిమిషాలకే ఆపేశానంటూ, తాను ఇలాంటి సినిమా తీయలేకపోయానని చెప్పిన మాటలు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. మరి, పూరి తన స్టైల్లో మరో సంచలన ప్రేమకథను తెరపైకి తీసుకువస్తాడో లేదో చూడాలి..!

Arjun Reddy only 45 Minutes Chusa🤯🔥
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version