Rajamouli- Mahesh Babu Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మరి తను అనుకున్నట్టుగానే మంచి సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. నిజానికి రాజమౌళి(Rajamouli) లాంటి దర్శకుడు బాహుబలి సినిమా చేసి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత చేసిన త్రిబుల్ ఆర్ (RRR) సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది…ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఇప్పుడు మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా కూడా రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అడ్వెంచర్ జానర్ లో సినిమా ఉండబోతుంది. ఇక ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ సినిమాకు సంబంధించిన స్టోరీ ఎలా ఉండబోతుంది అంటూ కొన్ని హింట్స్ అయితే ఇచ్చాడు. మరి ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఇలాంటి కథ రాలేదని చెబుతూ ఉండటం విశేషం…ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందంటూ అటు రాజమౌళి అభిమానులు, ఇటు మహేష్ బాబు అభిమానులు చాలా వరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా మహేష్ బాబు పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు అనేది వాస్తవం…
ఇక ఇప్పుడు కూడా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ee సినిమాకు సంబంధించిన కొన్ని లీకులను ఇచ్చారు. ఇప్పటి వరకు ఇండియాలో ఇలాంటి సినిమా రాలేదని ఆయన చెప్తుండటం విశేషం…ఇక రాజమౌళి కూడా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
మరి విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టుగానే ఈ సినిమాలో ప్రతి సీను భారీ రేంజ్ లో ఉండబోతుందా లేదా అనేది తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ‘ఇండియనా జోన్స్’ (Indiana Jones) అనే హాలీవుడ్ సినిమా ఇన్స్పిరేషన్ తో కథ అయితే రాసుకున్నారు.
మరి ఇదే కథతో ఇప్పుడు ఈ సినిమా కనక వస్తే ప్రేక్షకులు ఆ మూవీ ని రిసీవ్ చేసుకుంటారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమాని నెక్స్ట్ లెవెల్లో తీస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…తను అనుకున్నది అనుకున్నట్టుగా తీసి చూపించగలిగే సత్తా ఉన్న ఏకైక దర్శకుడు కూడా రాజమౌళినే కావడం విశేషం…